అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు

అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు

అసెంబ్లీ సమావేశాలకు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. రెండు వేల మందితో భారీ బందోబస్త్ నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. సభలు, సమావేశాలు నిరసన కార్యక్రమాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అసెంబ్లీ లోపల నాలుగు అంచెల భద్రత ఏర్పాటు చేశారు. టాస్క్ ఫోర్స్, లా అండ్ ఆర్డర్, స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ పోలీసులతో పహారా కాస్తున్నారు.

అసెంబ్లీ, మండలి సమావేశాలు 3రోజులు నిర్వహించే చాన్స్​ ఉందని టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ వర్గాలు చెప్తున్నాయి. ఇటీవల నిర్వహించిన టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎల్పీ సమావేశంలో కేసీఆర్‌‌‌‌ ఇండికేషన్‌‌‌‌ ఇచ్చారు. ప్రతిపక్ష సభ్యులు పట్టుబడితే మరో 2రోజులు సభ నిర్వహించే చాన్స్​ ఉన్నట్టు సమాచారం. ఇప్పటికి ఉన్న సమాచారం మేరకు మంగళవారంతో పాటు 12, 13 తేదీల్లో ఉభయ సభలు భేటీ కావాల్సి ఉంది. ఒకవేళ ఇంకో 2రోజులు సభ నడిపించాలని నిర్ణయిస్తే బుధవారంతోపాటు 14న సమావేశాలు కొనసాగే చాన్స్‌‌‌‌ ఉంది. ఈ నెల 16 నుంచి ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో 15వ తేదీలోపే అసెంబ్లీ సెషన్‌‌‌‌ ముగించాలనే ఆలోచనలో సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది. 

ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రైవేట్‌‌‌‌ వర్సిటీలు, మహిళా, ఫారెస్ట్‌‌‌‌ వర్సిటీల చట్ట సవరణ, మున్సిపల్‌‌‌‌ యాక్ట్‌‌‌‌ సవరణ, ఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌బీఎం చట్ట సవరణలు ప్రతిపాదించి ఆమోదించనున్నట్టు  తెలిసింది. రాష్ట్రాలపై కేంద్రం ఆర్థిక ఆంక్షలు, తెలంగాణకు అప్పులు రాకుండా కేంద్రం అడ్డుతగులుతోందని పేర్కొంటూ షార్ట్‌‌‌‌ డిస్కషన్‌‌‌‌ చేపట్టే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ప్రతిపక్షాలు ఇచ్చే అంశాల్లోనూ ఒకటి, రెండింటిపై చర్చించే అవకాశముందని సమాచారం.