మంచు ముసుగులో ఉత్తరాఖండ్

మంచు ముసుగులో ఉత్తరాఖండ్

ఉత్తరాఖండ్ ను మంచు ముంచెత్తుతోంది. పలు జిల్లాల్లో మంచు వర్షం కురుస్తోంది. మంచు దుప్పటి కప్పినట్లుగా రోడ్లు, ఇళ్లు తెల్లగా కనిపిస్తున్నాయి. ఎముకలు కొరికే చలిలో బయటకు రావాలంటే జనం భయపడుతున్నారు. చలికి తట్టుకోలేక మందంగా ఉండే జర్కిన్లు, షూస్ వేసుకొని ఆఫీసులకు వెళ్తున్నారు. మరోవైపు మంచు భారీగా కురవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. రోడ్లపై భారీగా పేరుకుపోయిన మంచును క్లియర్ చేస్తున్నారు అధికారులు.