రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్ భారత రాజ్యాంగం గుర్తించిన భాషల గురించి తెలుపుతుంది. ప్రస్తుతం గుర్తింపు పొందిన భాషల సంఖ్య 22. భారత రాజ్యాంగంలో అమలులోకి వచ్చినప్పుడు గుర్తింపు పొందిన భాషల సంఖ్య 14. 1950 తర్వాత కాలంలో ఎనిమిది భాషలు గుర్తింపు పొందాయి.
21 రాజ్యాంగ సవరణ చట్టం 1967: 15వ భాష – సింధీ
71వ రాజ్యాంగ సవరణ చట్టం1992: 16వ భాష – కొంకణి, 17వ భాష మణిపురి, 18వ భాష నేపాలీ.
92వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 (2004లో అమలు): 19వ భాష – బోడో, 20వ భాష – డోగ్రీ, 21వ భాష – మైథిలీ, 22వ భాష – సంతాలీ.
96వ రాజ్యాంగ సవరణ చట్టం 2011 ద్వారా ఒరియా అనే పదం స్థానంలో ఒడియా అనే పదాన్ని చేర్చారు. ప్రస్తుతం దీనిని ఒడియాగా ఉచ్ఛరించాలి.
ప్రస్తుతం రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో గుర్తింపు పొందిన 22 భాషలు చూస్తే 1. అస్సామీ 2. బెంగాలీ 3. బోడో 4. డోగ్రీ 5. గుజరాతీ, 6. హిందీ, 7. కన్నడ, 8. కాశ్మీరీ, 9. కొంకణి, 10. మైథిలి, 11. మలయాళం, 12. మణిపురి, 13. మరాఠీ, 14. నేపాలీ, 15. ఒడియా, 16. పంజాబీ, 17. సంస్కృతం, 18. సంతాలీ, 19. సింధీ, 20. తమిళం, 21. తెలుగు, 22. ఉర్దూ ఉన్నాయి. ఈ షెడ్యూల్లో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయాలన్నా, అదేవిధంగా నూతన భాషలను చేర్చాలన్నా రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే చేయాల్సి ఉంటుంది.
►ALSO READ | భారత విదేశాంగ విధానం మోదీ వ్యక్తిగత విధానమే: ప్రధానిపై రాహుల్ గాంధీ విమర్శలు..
