‘చిరైయా’ రివ్యూ: OTTకి వ‌చ్చిన కొత్త వెబ్ సిరీస్.. భార్య‌తో బ‌ల‌వంత‌పు శృంగారం.. తెలుగులోనూ స్ట్రీమింగ్

‘చిరైయా’ రివ్యూ: OTTకి వ‌చ్చిన కొత్త వెబ్ సిరీస్.. భార్య‌తో బ‌ల‌వంత‌పు శృంగారం.. తెలుగులోనూ స్ట్రీమింగ్

OTTలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు దర్శనం ఇస్తున్న విషయం తెలిసిందే. తెలుగు సినిమాలే కాకుండా వేరే ఇతర భాషల నుంచి కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ఏంట్రీ ఇస్తున్నాయి. లేటెస్ట్గా హిందీ వెబ్ సిరీస్ ‘చిరైయా’ జియోహాట్‌స్టార్‌ (JioHotstar)లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది.

ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సిరీస్ ఏకంగా 12 భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, భోజ్ పురి, ఒరియా, హర్యాన్వి, రాజస్థానీ, భాషల్లో అందుబాటులో ఉంది.

శశాంత్ షా డైరెక్ట్ చేసిన ఈ సిరీస్లో దివ్య దత్తా, సంజయ్ మిశ్రా, ప్రసన్న బిష్ఠ్, సిద్ధార్థ్ షా,ఫైసల్ రషీద్ తదితరులు నటించారు. మొత్తం 6 ఎపిసోడ్లతో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ బెంగాలీలో వచ్చిన ‘సంపూర్ణ’ వెబ్ సిరీస్కు రీమేక్గా తెరకెక్కింది. 

వైవాహిక అత్యాచారం (Marital Rape) అనే సున్నితమైన అంశం చుట్టూ ‘చిరైయా’ కథ సాగుతుంది. ఇంకా అర్ధమయ్యే రీతిలో చెప్పాలంటే.. పెళ్లి అయినప్పటికీ భార్య అంగీకారం లేకుండా భర్త బలవంతంగా శృంగారంలో పాల్గొంటే, అది కూడా అత్యాచారంగా పరిగణించాలనే సందేశాన్ని ఈ సిరీస్ బలంగా చెబుతుంది. ఈ సిరీస్ చూపిన ధైర్యమైన, తీవ్రమైన దృక్కోణాన్ని చూసిన విమర్శకులు ప్రశంసించారు. వివాహంలో సమ్మతి చుట్టూ ఉన్న నిషిద్ధాన్ని బద్దలుకొట్టే ఈ చిత్రం ‘ప్రస్తుతం చాలా అవసరమైనది’ అని వారు పేర్కొన్నారు.

ఈ సిరీస్‌లో చూపించిన ధైర్యమైన, తీవ్ర దృక్కోణాన్ని విమర్శకులు ప్రశంసిస్తున్నారు. వివాహంలో ‘సమ్మతి’ అనే అంశంపై ఉన్న మౌనాన్ని చెరిపే ప్రయత్నంగా దీన్ని పేర్కొంటూ, ప్రస్తుత సమాజానికి ఇది అవసరమైన కథ అని అభిప్రాయపడుతున్నారు.

కథేంటంటే:

ఈ కథ ఒక సంప్రదాయ భారతీయ కుటుంబ నేపథ్యంలో సాగుతుంది. కమలేష్ (దివ్యదత్తా) వాళ్లింట్లో పెద్ద కోడలు. భార్యగా, కోడలిగా, తల్లిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూ కుటుంబాన్ని నడుపుతుంది. తన మరిది అరుణ్​ (సిద్ధార్థ్ షా)ను కన్న కొడుకులా చూసుకుంటుంది. అతను ఎప్పుడూ తప్పు చేయడని నమ్ముతుంది.

అరుణ్​కు పూజా (ప్రసన్న బిష్త్‌)తో పెళ్లి జరుగుతుంది. వాళ్ల మొదటి రాత్రి అరుణ్ తనను లైంగికంగా వేధించాడని కమలేష్‌‌‌‌‌‌‌‌తో చెప్తుంది పూజ. అరుణ్​ గురించి తప్పుగా చెప్పడంతో కమలేష్​కు కోపం వచ్చి, పూజను చెంపపై కొడుతుంది. పూజకు ఇష్టం లేకపోయినా పదే పదే బలవంతంగా శృంగారం చేస్తాడు. ఇలా అరుణ్ లోని రాక్షసుడు బయటకు వచ్చిన నిజాన్ని చాలా ఆలస్యంగా పసిగడుతుంది కమలేష్. ఇక ఫ్యామిలీ గౌరవం కాపాడాలా? లేక పూజకి న్యాయం చేయాలా? అనే తీవ్రమైన సంఘర్షణలో పడుతుంది. ఆ తర్వాత ఈ సమస్యకు కమలేష్ ఎలా పరిష్కారం కనుగొంటుంది? చివరకు పూజ ఈ హింస నుంచి బయటపడిందా? అన్నది తెలుసుకోవాలంటే ‘చిరైయా’ సిరీస్ చూడాల్సిందే!

ఎలా ఉందంటే:

‘చిరైయా’ సాధారణ ఫ్యామిలీ డ్రామా కాదు. వైవాహిక అత్యాచారం (Marital Rape) వంటి సున్నితమైన అంశాన్ని నేరుగా, ఎలాంటి కమర్షియల్ ముసుగులు లేకుండా చూపించడానికి ప్రయత్నించిన కంటెంట్ ఇది. ముఖ్యంగా భారతీయ కుటుంబ వ్యవస్థలో “భర్త హక్కు” అనే పేరుతో దాచిపెట్టబడే సమస్యను ప్రశ్నించడం ఈ సిరీస్ ప్రధాన బలం.

►ALSO READ | Mamitha Kara: ధనుష్–మమితా కాంబోలో థ్రిల్లర్.. ‘కారా’లో సెల్లీగా షాకింగ్ రోల్!

దర్శకుడు శశాంత్ షా కథను మెలోడ్రామాటిక్‌గా (భావోద్వేగాలను, నాటకీయతను) ఎక్కువ చూపించకుండా, రియలిస్టిక్ టోన్‌లో తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగినా, భావోద్వేగ తీవ్రతను నిలబెట్టే విధంగా కథనం కొనసాగుతుంది.

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, దివ్య దత్తా పాత్ర సిరీస్‌కు బ్యాక్‌బోన్‌లా నిలుస్తుంది. కుటుంబ గౌరవం, న్యాయం మధ్య ఇరుక్కుపోయిన మహిళగా ఆమె నటన ప్రభావవంతంగా ఉంటుంది. అలాగే సంజయ్ మిశ్రా తన అనుభవంతో పాత్రకు న్యాయం చేశారు. మిగతా నటీనటులు కూడా కథకు తగ్గట్టుగా సహజమైన నటనను కనబరిచారు.

మొత్తంగా ‘చిరైయా’ ఒక బోల్డ్, ఆలోచింపజేసే వెబ్ సిరీస్. కమర్షియల్ ఎంటర్టైన్‌మెంట్ కంటే కంటెంట్‌కి ప్రాధాన్యత ఇచ్చే ప్రేక్షకులకు ఇది మంచి ఎంపికగా నిలుస్తుంది.