మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు రంగంలోకి ఏఐసీసీ

మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు రంగంలోకి ఏఐసీసీ

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు ఏఐసీసీ రంగంలోకి దిగింది. ఈ మేరకు  మంగళవారం (మార్చి 24)  ఏఐసీసీ సెక్రెటరీ, టీపీసీసీ వర్కింగ్ కమిటీ మెంబర్ వంశీ చంద్ రెడ్డి జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. రాజీనామాకు గల కారణాలపై జీవన్ రెడ్డితో వంశీచంద్ రెడ్డి చర్చించినట్లు తెలిసింది. 

ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో జీవన్ రెడ్డిని ఫోన్‎లో మాట్లాడించినట్లు సమాచారం. రాజీనామాపై నిర్ణయం మార్చుకోవాలని జీవన్ రెడ్డిని వంశీ చంద్ రెడ్డి కోరినట్లు తెలిసింది. వంశీ చంద్ రెడ్డి కంటే ముందే జీవన్ రెడ్డి ఇంటికి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వెళ్లిన విషయం తెలిసిందే. ఇరువురు భేటీ అయ్యి చర్చించారు. ఈ భేటీ అనంతరం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తన నిర్ణయం మార్చుకోనని తేల్చి చెప్పారు. 

►ALSO READ | తెలంగాణలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు.. సర్వర్ డౌన్ తిప్పలే కారణం

ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి ఇంటికి ఏఐసీసీ ప్రతినిధి వంశీ చంద్ రెడ్డి వెళ్లి భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‎పై తీవ్ర అసంతృప్తిగా ఉన్న జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తానని ప్రటించిన విషయం తెలిసిందే. మార్చి 25న పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. దీంతో పలువురు కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డి పార్టీని వీడకుండా ఉండేందుకు బుజ్జగిస్తున్నారు.