చేనేతతోనే పర్యావరణ పరిరక్షణ .. చార్మినార్దగ్గర హ్యాండ్లూమ్ హెరిటేజ్ వాక్

చేనేతతోనే పర్యావరణ పరిరక్షణ .. చార్మినార్దగ్గర హ్యాండ్లూమ్ హెరిటేజ్ వాక్
  •     రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి.చిరంజీవులు

చార్మినార్, వెలుగు: ప్రపంచ కాలుష్యంలో దాదాపు 20 శాతం వస్త్ర పరిశ్రమ నుంచే ఉత్పన్నమవుతోందని, అందుకే చేనేత వస్త్రాలను ధరించి పర్యావరణాన్ని కాపాడాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి.చిరంజీవులు పిలుపునిచ్చారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గురువారం చార్మినార్​ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి చౌమహల్లా ప్యాలెస్ వరకు నిర్వహించిన హ్యాండ్లూమ్ హెరిటేజ్ వాక్‌‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. భారతీయ చేనేత కేవలం వస్త్ర ఉత్పత్తి మాత్రమే కాదని, దేశ సంస్కృతి, సంప్రదాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, లక్షలాది కళాకారుల జీవనాధారానికి ప్రతీక అని అన్నారు. చేనేత వస్త్రాలను ప్రోత్సహించడం వల్ల గ్రామీణ ఉపాధి పెరగడంతో పాటు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు దోహదపడుతుందన్నారు. హ్యాండ్లూమ్ దినోత్సవ వ్యవస్థాపకులు యర్రమాద వెంకన్న నేత మాట్లాడుతూ, చేనేత అనేది కళాకారులకే పరిమితమైన అంశం కాదని, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఉద్యమమని పేర్కొన్నారు. ఈ హెరిటేజ్ వాక్‌‌లో పద్మశ్రీ గజం అంజయ్య, సినీ నటులు పూనమ్ కౌర్, గాయత్రి భార్గవి, జాతీయ అవార్డు గ్రహీతలు గంజి యాదగిరి, కొలను రవీందర్  తదితరులు పాల్గొన్నారు.