రైతులకు గుడ్ న్యూస్: ఎరువుల నిల్వలపై కేంద్రం కీలక ప్రకటన

రైతులకు గుడ్ న్యూస్: ఎరువుల నిల్వలపై కేంద్రం కీలక ప్రకటన

న్యూఢిల్లీ: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ 2026 ఖరీఫ్ సీజన్‎కు దేశంలో సరిపడా ఎరువుల నిల్వలు ఉన్నాయని తెలిపింది. రైతులు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని పేర్కొంది. మిడిల్ ఈస్ట్‎లో ఉద్రిక్తతలతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. 

ఇండియా ఎక్కువగా చైనా, రష్యా, గల్ఫ్ దేశాల నుంచి ఎరువులు దిగుమతి చేసుకుంటోన్న విషయం తెలిసిందే. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో మిడిల్ ఈస్ట్ రణరంగంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జల సంధిని ఇరాన్ క్లోజ్ చేసింది. అలాగే గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు, ముడి చమురు తయారీ, రవాణా కేంద్రాలపై ఇరాన్ దాడులతో విరుచుకుపడుతోంది. 

►ALSO READ | పొలిటికల్ లీడర్స్ మస్త్ ఖుషీ: భారీగా పెరగనున్న అసెంబ్లీ, ఎంపీ సీట్లు..?

ఇరాన్ దాడులు, హార్మూజ్ జల సంధి మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. హార్మూజ్ మూసివేతతో గల్ఫ్ కంట్రీస్ నుంచి ఎరువుల రవాణాకు కూడా ఆటంకం ఏర్పడింది. ఈ పరిస్థితుల దృష్ట్యా దేశంలో ఎరువుల నిల్వలపై కేంద్రం ప్రకటన చేసింది. దేశంలో రాబోయే ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఎరువులు సరిపడా ఉన్నాయని తెలిపింది.