వైరల్​ వీడియో: వామ్మో... గాలికి విమానం కూడా కదులుతుందా..

వైరల్​ వీడియో: వామ్మో... గాలికి విమానం కూడా కదులుతుందా..

ప్రకృతి (Nature) విలయతాండవం ముందు ఎంతటి అద్భుత నిర్మాణాలైనా, ఎలాంటి బలమైన ఆవిష్కరణలైనా తల వంచాల్సిందే. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) ఆ విషయాన్ని తాజాగా మరోసారి రుజువు చేసింది. అర్జెంటీనా (Argentina) రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో వీచిన బలమైన గాలులు (Heavy Winds) విమానాలను సైతం కదిలించేశాయి. తూర్పు అర్జెంటీనాను భారీ తుఫాను (Storm)హడలెత్తిస్తోంది

ఈదురుగాలి ధాటికి ర‌న్‌వేపై పార్క్ చేసిన విమానం ప‌క్కకు జ‌రిగింది. దాదాపు 150 కిలోమీట‌ర్ల వేగంతో గాలి వీచింది. అర్జెంటీనా విమానాశ్రయంలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌కు చెందిన వీడియో వైర‌ల్ అవుతోంది. 

 

 

అర్జెంటీనాలో భీక‌ర గాలివాన వ‌చ్చింది. బ్యూన‌స్ ఏరిస్ స‌మీపంలోని ఏరోపార్క్ జార్జ్ న్యూబెరీ విమానాశ్రయం పార్కింగ్‌లో ఉన్న ఓ ప్రైవేటు విమానం ఆ గాలి ధాటికి ప‌క్కకు(Airplane Spins) క‌దిలింది. ర‌న్‌వేపై నిలిచిన ఆ విమానం.. జోరుగా వీస్తున్న గాలి ప్రభావానికి.. స్పిన్ అయ్యింది. అదే ర‌న్‌వేపై ఉన్న బోర్డింగ్ స్టెప్స్ కూడా ప‌క్కకు ఒరిగాయి. సుమారు 150 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి.

@Rainmaker1973 అనే ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ అయిన ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు 9.4 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ తుఫాను ధాటికి బ్యూనస్ ఎయిర్స్ నాశనం అవుతోందని ఒకరు కామెంట్​ చేశారు. అసాధారణ వాతావరణ పరిస్థితులకు ఎవరైనా తలవంచాల్సిందే ఇంకొకరు పోస్ట్​ చేశారు ప్రకృతి వైల్డ్‌గా మారితే ఎవరూ ఏమీ చేయలేరు  అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

అర్జెంటీనాలో వ‌చ్చిన గాలిదుమారం వ‌ల్ల భారీ న‌ష్టం జ‌రిగింది. 14 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక ప్రదేశాల్లో డ్యామేజ్ జ‌రిగింది. విద్యుత్తు అంత‌రాయం ఏర్పడింది. బ‌హియా బ్లాంకా సిటీలో బ‌ల‌మైన గాలికి రోల‌ర్ స్కేటింగ్ క్రీడాప్రాంగ‌ణం కూలింది. ఈ ఘ‌ట‌న‌లో 14 మంది గాయ‌ప‌డ్డారు. బ‌హియా బ్లాంకా ప్రదేశానికి అర్జెంటీనా అధ్యక్షుడు జావియ‌ర్ మిలే టూర్ చేశారు. తుఫాన్ ప్రభావానికి ఉరుగ్వేలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు.