
హైదరాబాద్ (Hyderabad Rains) శివారు రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో కొద్దిసేపు కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమైయ్యాయి. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. ఆరాంఘర్ కూడలి వద్ద నలువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రేమావతి పేట, శివరాంపల్లి చౌరస్తా, కాటేదాన్ రైల్వే బ్రిడ్జి ప్రాంతాల్లో వరదనీరు నిలవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.
గురువారం హైదరాబాద్ లోనూ భారీ వర్షం కురిసింది. ఈ వర్షాలతో నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కొన్ని చోట్ల ఆకాశంలో మెరుపులు.. ఉరుములతో జనం భయానికి గురైయ్యారు. నగరంలోని గచ్చిబౌలి, యూసుఫ్‌గూడ, సోమాజీగూడ, అమీర్‌పేట, కూకట్‌పల్లి, పంజాగుట్ట, ఖైరతాబాద్, కాటేదాన్, రాజేంద్రనగర్, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు కురవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.