గండిపేటకు భారీగా వరద నీరు

గండిపేటకు భారీగా వరద నీరు

రంగారెడ్డి జిల్లా : ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు హిమాయత్ సాగర్, గండిపేట చెరువుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ మేరకు జలమండలి అధికారులు రెండు గేట్లు ఒక్కొక్క ఫీట్ చొప్పున ఎత్తి నీటిని దిగువ ప్రాంతానికి వదులుతున్నారు. అయితే రాజేంద్రనగర్ ఓఆర్ఆర్ బ్రిడ్జి కింద సర్వీస్ రోడ్డు వద్ద.. చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన యువకులు వరద ప్రాంతాలలోకి వచ్చి ప్రమాదకరంగా సెల్ఫీలు దిగుతూన్నారు. కొంతమంది నీళ్లలో ఆడుతూ బండరాళ్లపైకెక్కి సెల్ఫీలు దిగుతున్నారు.

మరి కొందరైతే ఏకంగా వరదలు దాటుతూ సెల్ఫీలు దిగుతున్నారు. వీరితో చిన్నారులు సైతం ఉన్నారు. ఇది గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. ప్రమాదవశాత్తు వరదలో కొట్టుకోపోతే ఎవరు బాధ్యత వహిస్తారని సానికులు ప్రశ్నిస్తున్నారు. జలమండలి అధికారులు, పోలీసులు చెరువులోకి ఎవరినీ పోనియకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని వారు కోరారు. దీంతో వెంటనే అధికారులు భద్రతా ఏర్పాటు చేశారు.