మహారాష్ట్రలో కూలిన హెలికాప్టర్.. ముగ్గురు దుర్మరణం

మహారాష్ట్రలో కూలిన హెలికాప్టర్.. ముగ్గురు దుర్మరణం

బుధవారం(అక్టోబర్ 02) తెల్లవారుజామున మహారాష్ట్రలోని పూణేలో హెలికాప్టర్ కూలిపోయింది. ఉదయం 6.45 గంటల సమయంలో బవధాన్ బుద్రుక్ గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పైలట్ సహా ఇద్దరు ఇంజనీర్లు మరణించారు. 

ALSO READ | సైబర్ క్రిమినల్స్ కోసం ఆపరేషన్‌‌ చక్ర 3

ప్రమాదం జరిగిన వెంటనే మంటలు చెలరేగడంతో హెలికాప్టర్ పూర్తిగా కాలిపోయింది. పొగలు గమినించిన స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకొని అధికారులకు సమాచారమిచ్చారు. పోలీసులు, వైద్య బృందాలు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నాయి. ఈ హెలికాప్టర్ ప్రభుత్వానిదా లేక ప్రైవేట్‌‌దా అనేది తెలియాల్సి ఉంది.