లాక్​డౌన్​ లో ఖాళీగా ఉండలేక..

లాక్​డౌన్​ లో ఖాళీగా ఉండలేక..

బ్రెజిల్​కు చెందిన జెనెసిస్ గోమ్స్ అనే వ్యక్తి చేసిన పని అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.  చెడిపోయిన కార్​, బైక్  పార్ట్స్​తో అతను హెలికాప్టర్​ను తయారు చేశాడు అతను. తన ఫ్రెండ్​తో కలిసి అందులో చక్కర్లు కూడా కొట్టాడు.  అయితే గోమ్స్​కు చిన్నప్పటి నుంచి ఏవియేషన్​ అంటే ఇష్టం. ఎప్పటికైనా ఏవియేషన్​లో జాబ్​ చేయాలి అనుకున్నాడు కానీ, చేయలేకపోయాడు. రెండేండ్లుగా లాక్​డౌన్​ వల్ల ఇంట్లోనే ఉన్నాడు. దీంతో ఆ ఖాళీ టైంను కొత్త  వస్తువులు కనిపెట్టడానికి ఉపయోగించాడు.  
ఈమధ్య ఫోక్స్​వాగన్​ కార్​ ఇంజిన్, కార్, బైక్​ పార్ట్​లతో హెలికాప్టర్​ను తయారు చేశాడు.  మూడు టైర్లు, రెక్కలు పెట్టాడు.  అందులో ఇద్దరు కూర్చునే వీలుంది.  అలా దాన్ని హెలికాప్టర్​లా గాల్లో ఎగిరించాడు.  దీంట్లో ఒక ఫ్రెండ్​తో కలిసి రోడ్​ మీద కొంత దూరం వెళ్లాడు. ఆ తర్వాత కేకలు వేస్తూ గాల్లోకి  ఎగిరారు. ఈ వీడియోను అక్కడి వాళ్లు ట్విట్టర్​లో పోస్ట్ చేశారు.