రాజా గౌతమ్ 'బ్రేక్ అవుట్' ఫస్ట్ లుక్

రాజా గౌతమ్ 'బ్రేక్ అవుట్' ఫస్ట్ లుక్

టాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ 'బ్రేక్ అవుట్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సుబ్బు చెరుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ థ్రిల్లర్ మూవీ ఫస్ట్ లుక్ తాజాగా విడుదల చేశారు. చూడగానే ఎంతో ఆసక్తి కలిగించేలా ఈ ఫస్ట్ లుక్ ఉంది. అయితే గౌతమ్ ఎన్నో సినిమాల్లో నటించినా కూడా హీరోగా మాత్రం ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. వరుసగా సినిమాల్లో నటిస్తున్నా గౌతమ్ సరైన సక్సెస్ అందుకోలేకపోయాడు.

ఇక గౌతమ్ ఇన్నాళ్లకు మళ్లీ ఒక ప్రయత్నంను చేయబోతున్నాడు. అదృష్టం కలిసి రాకపోవడంతో ఇప్పటివరకూ చేసిన సినిమాలు ఫ్లాప్ అవ్వగా.. 'బ్రేక్ అవుట్' సినిమాపై రాజా గౌతమ్ నమ్మకంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. నటుడిగా ఈ సినిమా ఆయనను నిలబెడుతుందేమో చూడాలి. ఈ మూవీని ఏఎంఎఫ్ బ్యానర్ పై అనీల్ మెడుగా నిర్మిస్తున్నారు. జాన్స్ రుపెర్ట్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి అర్జున్ బసవ ఎడిటర్ గా చేస్తున్నారు.