Allu Arjun: 40వ పుట్టినరోజును జరుపుకున్న అల్లు స్నేహారెడ్డి.. ‘క్యూటీ..’ అంటూ భార్యకి బన్నీ విషెస్

Allu Arjun: 40వ పుట్టినరోజును జరుపుకున్న అల్లు స్నేహారెడ్డి.. ‘క్యూటీ..’ అంటూ భార్యకి బన్నీ విషెస్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తన భార్య స్నేహారెడ్డి పుట్టినరోజును (సెప్టెంబర్ 29న) గ్రాండ్గా జరుపుకున్నారు. 1985 సెప్టెంబర్ 29న జన్మించిన అల్లు స్నేహారెడ్డి.. ఈ 2025 ఏడాదితో 40వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తన సతీమణి స్నేహాకు బర్త్ డే విషెస్ తెలిపారు బన్నీ. ఈ క్రమంలో స్నేహరెడ్డితో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను బన్నీ షేర్ చేస్తూ.. క్యూట్ క్యాప్షన్ ఇచ్చారు. ఇపుడు ఈ ఫొటోలు, బన్నీ చెప్పిన విషెస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. 

సోమవారం (2025సెప్టెంబర్ 29న) తన భార్య అల్లు స్నేహారెడ్డికి బన్నీ స్పెషల్ విషెస్ తెలిపారు. ‘హ్యాపీ బర్త్‌డే క్యూటీ’ అని విషెష్ చెబుతూ ఓ రెండు ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ఇందులో ఈ బ్యూటీఫుల్ జోడీ ఒకేలాంటి మోనోక్రోమ్ డ్రెస్సులలో టూరిస్ట్‌ల లాగా నవ్వుతూ కనిపించారు. బ్లాక్ జాకెట్స్, సన్‌గ్లాసెస్, టీ-షర్ట్స్ ప్యాంట్స్‌లో ఉన్న ఈ జంట నవ్వుతూ పోజులివ్వడం ఐకాన్ ఫ్యాన్స్ని ఖుషి చేస్తుంది.

ఈ క్రమంలో అల్లు అర్జున్ బెస్ట్ ఫ్రెండ్స్లో ఒకరైన మంచు లక్ష్మీ వెంటనే స్పందిస్తూ..‘హ్యాపీ బర్త్‌డే లవ్’ అని విష్ చేసింది. అలాగే, చాలామంది ఫ్యాన్స్ ‘హ్యాపీ బర్త్ డే వదిన’ అని శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఈ బ్యూటీఫుల్ జోడీ ఖాళీ సమయాల్లో ఫారన్ ట్రిప్స్తో జాలీగా ఎంజాయ్ చేస్తుంటారు. సహజంగా సినిమా ఫంక్షన్స్లో తప్ప.. హాలిడే ట్రిప్స్లోను, గ్లామర్ క్లిక్స్లోను అల్లు స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఇంస్టాగ్రామ్లో పలు ఫోటోస్, వీడియోలు షేర్ చేస్తూ యాక్టీవ్గా ఉంటుంది స్నేహారెడ్డి.

ఇకపోతే.. ఈ జంట మార్చి 6, 2011న హైదరాబాద్‌లో మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అయాన్ అనే కొడుకు, అర్హ అనే కూతురు ఉన్నారు. అర్హ 2023లో సమంత నటించిన 'శాకుంతలం'మూవీతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది. 

ప్రస్తుతం అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో ఓ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ వరుస షూటింగ్ షెడ్యూల్స్ తో బిజీగా ఉంది. ఇటీవలే ముంబైలో షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని, నెక్స్ట్ షెడ్యూల్ కోసం అబుదాబికి పయనం అయింది. అక్కడ కీలక ఘట్టాలను షూట్ చేయనున్నారు అట్లీ. ఈ సినిమాలో అల్లు అర్జున్ నాలుగు విభిన్న పాత్రల్లో కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తుంది.