
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే అతడు, ఖలేజా సినిమాలు గుర్తొస్తాయి. పదకొండేళ్ల తర్వాత మళ్లీ ఈ కాంబోలో సినిమా రాబోతోంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మించే ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని ఎప్పుడు స్టార్ట్ చేస్తారనే విషయంపై ఇంతవరకు ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేదు. అయితే అతి త్వరలో షూటింగ్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న మహేష్‌ను త్రివిక్రమ్, నిర్మాత నాగవంశీ, తమన్ కలిశారు. ‘వర్క్ అండ్ చిల్.. ప్రొడక్టివ్ ఆఫ్టర్‌నూన్ విత్ ద టీమ్’ అంటూ ఓ గ్రూప్ ఫొటోను పోస్ట్ చేశాడు మహేష్. ప్రస్తుతం దుబాయ్‌లో చిల్ అవుతూనే ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్‌పై కూడా ఫోకస్ పెట్టినట్టు ఈ ట్వీట్‌తో మహేష్ క్లారిటీ ఇచ్చాడు. సంక్రాంతి తర్వాత షూటింగ్ కూడా స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ రివెంజ్ డ్రామాలో పూజా హెగ్డే
హీరోయిన్గా నటించనుంది. ఇక రాజమౌళి డైరెక్షన్‌లోనూ మహేష్ ఓ మూవీ చేయాల్సి ఉంది. వచ్చే యేడు సెకెండాఫ్‌లో అది స్టార్టయ్యే చాన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతం పరశురామ్ తీస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తున్నాడు మహేష్ బాబు. ఏప్రిల్1న ఈ మూవీ విడుదల కానుంది.