ఫిలిప్పీన్స్​ మార్కెట్లోకి హీరో

ఫిలిప్పీన్స్​ మార్కెట్లోకి హీరో

న్యూఢిల్లీ: టూవీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్​ ఫిలిప్పీన్స్​ మార్కెట్లోకి రావడానికి టెర్రాఫిర్మా మోటార్స్​ కార్పొరేషన్​తో ఒప్పందం కుదుర్చుకుంది. బండ్ల అసెంబ్లింగ్​, డిస్ట్రిబ్యూషన్​ కోసం ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. కొలంబియన్​ గ్రూప్​కు చెందిన టెర్రాఫిర్మా ఇక నుంచి హీరో మోటోకార్ప్​ డిస్ట్రిబ్యూటర్​గా పనిచేస్తుంది. అసెంబ్లింగ్​కోసం లగునా సిటీలో 29 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్లాంటును నిర్మిస్తుంది.

ఇది 2024 జూన్​ తరువాత నుంచి పనిచేస్తుంది. ప్రస్తుతం హీరో మోటోకార్ప్ ఆసియా, ఆఫ్రికా, మిడిల్​ఈస్ట్​ దక్షిణ, మధ్య అమెరికాలోని 43 దేశాల్లో టూవీలర్లను అమ్ముతోంది. దీనికి భారతదేశంలో ఆరు, కొలంబియా, బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో ఒక్కొక్కటి సహా మొత్తం ఎనిమిది ప్లాంట్లు ఉన్నాయి.