అల్లూరి ఫ్రీ రిలీజ్ కు అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ 

అల్లూరి ఫ్రీ రిలీజ్ కు అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ 

యంగ్ హీరో శ్రీ విష్ణు ఎంచుకనే కథలే కాదు..ఆయన నటించే సినిమాల టైటిల్స్ కూడా విభిన్నంగా ఉంటాయి. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధంలేకుండా కంటెంట్ ఉన్న క‌థ‌ల‌ను ఎంచుకుంటూ ప్రేక్షకుల‌లో ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. ఫ‌లితం ఎలా ఉన్నా ప్రేక్షకుల‌కు కొత్త క‌థ‌ల‌ను ప‌రిచ‌యం చేయ‌డంలో శ్రీ విష్ణు ఎప్పుడు ముందు వ‌రుస‌లో ఉంటాడు.

శ్రీ విష్ణు పోలీస్‌ ఆఫీసర్‌‌గా నటించిన చిత్రం ‘అల్లూరి’. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ నిర్మించారు. ఈ నెల 23న సినిమా విడుదల కానున్న సందర్భంగా ప్రసాద్ ల్యాబ్స్‌లో ట్రైలర్ లాంచ్ ఈ వెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  హజరైన  నేచురల్ స్టార్ నాని ట్రైలర్ ను  లాంచ్ చేశారు. ‘ట్రైలర్ ఎనర్జిటిక్ గా చాలా బాగుందన్నారు. శ్రీ విష్ణు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడని... ఈ మూవీ మంచి విజయం  సాధించాలని కోరుకుంటున్నాని చెప్పారు.

 

హీరో నాని ట్రైలర్ ను లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందని శ్రీ శిష్ణు అన్నారు. నటీనటులు, టెక్నిషియన్స్ అందరూ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారని తెలిపారు. ఈ సందర్భంగా టీమ్ సభ్యులందిరకీ థ్యాంక్స్ చెప్పారు. ప్రీ రిలీజ్ కి అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారని చెప్పాడు. మంచి కంటెంట్ ఉన్న సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందన్నారు. ఈ కార్య్రమంలో నిర్మాత  బెక్కం వేణుగోపాల్, డీఓపీ రాజ్ తోట, లిరిక్ రైటర్ రాంబాబు గోసాల, ఫైట్ మాస్టర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.