టాలీవుడ్ యాక్టర్ నవదీప్(Navdeep) రామ్ చరణ్(Ram Charan) గురించి, ధ్రువ సీక్వెల్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రెజెంట్ ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ లవ్ మౌళి(Love Mouli). దర్శకుడు అవనీంద్ర(Avaneedra) తెరకెక్కిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ త్వరలొనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న నవదీప్ ఆయన నటించిన సినిమాల గురించి, నటించబోయే సినిమాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇందులో భాగంగా ఆయన నటించిన సూపర్ హిట్ మూవీ ధ్రువ సీక్వెల్ గురించి ప్రస్తావించారు.
మీరు నటించిన సినిమాల్లో ధ్రువ చాలా స్పెషల్. ఇప్పుడు దానికి సీక్వెల్ కూడా వస్తుంది కదా అందులో మీరు ఉంటారా అని అడగగా. దానికి సమాదనంగా నవదీప్ మాట్లాడుతూ.. ధ్రువ సినిమాలో నేను చనిపోతాను అని అన్నారు నవ్వుతూ. దానికి యాంకర్.. అంటే సీక్వెల్ కదా.. కంటిన్యూ ఉండాలని రూల్ లేదు కదా. దానికి నవదీప్.. ధ్రువ సీక్వెల్ కంటిన్యూ ఉంటుందా, ఉండదా అని నాకు తెలియదు కానీ, నన్ను మాత్రం కాంటాక్ట్ అవలేదు అని చెప్పుకొచ్చాడు.
ఇక ధ్రువ సినిమాలో రామ్ చరణ్ తో వర్క్ చేశారు కదా.. ఎలా ఉడేది ఆయనతో అది అడిగారు యాంకర్. దానికి నవదీప్.. రామ్ చరణ్ జెమ్. చందమామ సినిమా తరువాత ఆయనతో నాకు పరిచయం ఏర్పడింది. చిరంజీవి అబ్బాయి అనే ట్యాగ్ నుండి ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. అలాంటి వ్యక్తులతో పనిచేసినప్పుడు మనకు స్ఫూర్తిగా అనిపిస్తుంది. అవన్నీ చిరంజీవి గారి నుండి వచ్చిన మంచి తనం. అందుకే ఆయన ఆస్థాయిలో ఉన్నారు. ధ్రువ తరువాత మళ్ళీ ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రాలేదు. నేను కూడా ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్నాను.. అంటూ రామ్ చరణ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు నవదీప్. దీంతో ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.