18 పేజెస్‌‌‌‌‌‌‌‌ లాంటి వెరైటీ సినిమాలో నటించడం కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇదే ఫస్ట్ టైమ్

18 పేజెస్‌‌‌‌‌‌‌‌ లాంటి వెరైటీ సినిమాలో నటించడం కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇదే ఫస్ట్ టైమ్

అడ్వెంచరస్‌‌‌‌‌‌‌‌ మూవీ ‘కార్తికేయ2’తో ప్యాన్ ఇండియా హిట్ అందుకున్న నిఖిల్..  ‘18 పేజెస్’ లాంటి పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఇవాళ రిలీజ్ అవుతోన్న సందర్భంగా నిఖిల్ చెప్పిన విశేషాలు. 

‘‘18 పేజెస్‌‌‌‌‌‌‌‌ లాంటి వెరైటీ సినిమాలో నటించడం కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇదే ఫస్ట్ టైమ్. ఇదొక క్రేజీ లవ్‌‌‌‌‌‌‌‌స్టోరీ. లవ్‌‌‌‌‌‌‌‌తో పాటు థ్రిల్, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయి.  అమ్మాయిలను ఎలా రెస్పెక్ట్ చేయాలో యూత్‌‌‌‌‌‌‌‌కి మంచి మెసేజ్ కూడా ఇచ్చారు.  కథ సింపుల్‌‌‌‌‌‌‌‌గా ఉన్నా, ట్విస్టులు చాలా డిఫరెంట్‌‌‌‌‌‌‌‌గా ఉంటాయి. క్లైమాక్స్ ఎవరూ గెస్‌‌‌‌‌‌‌‌ చేయని విధంగా  ఉంటుంది. సుకుమార్ గారి కథలో నటించడం హ్యాపీ. ఆయన మార్క్ కచ్చితంగా కనిపిస్తుంది. నందిని పాత్రలో అనుపమ బెస్ట్ ఇచ్చింది.

 మేమిద్దరం బెస్ట్ పెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పేరు తెచ్చుకుంటాం. ఆమెతో వర్క్ చేయడం హ్యాపీగా ఉంటుంది.  ‘కార్తికేయ2’ సక్సెస్ తర్వాత కొన్ని సీన్స్ ఇంప్రవైజ్ చేయడానికి రీ షూట్ చేశాం.  ఇతర భాషల్లో డబ్బింగ్‌‌‌‌‌‌‌‌కి ప్లాన్ చేయలేదు. తెలుగులో మాత్రమే  రిలీజ్ చేస్తున్నాం. యూత్‌‌‌‌‌‌‌‌, ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్‌‌‌‌‌‌‌‌గా వస్తున్నాం. సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్‌‌‌‌‌‌‌‌గా ఉన్నా.  ఇక కొత్త సినిమాల సెలెక్షన్‌‌‌‌‌‌‌‌లో ఆచితూచి అడుగులేస్తున్నా. ప్రస్తుతం ‘స్పై’ అనే ప్యాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాను. ‘కార్తికేయ3’ వచ్చే ఏడాది చివర్లో మొదలవుతుంది’’.