సెంటిమెంట్ లేదు,ఓన్లీ ఎంటర్‌‌‌‌టైన్మెంట్..ఎక్స్‌‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌‌

సెంటిమెంట్ లేదు,ఓన్లీ ఎంటర్‌‌‌‌టైన్మెంట్..ఎక్స్‌‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌‌

నితిన్ హీరోగా వక్కంతం వంశీ తెరకెక్కించిన చిత్రం ‘ఎక్స్‌‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌‌’ శ్రీలీల హీరోయిన్. ఎన్. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా హీరో నితిన్‌‌ చెప్పిన విశేషాలు.. 

‘ఇందులో నేను జూనియర్ ఆర్టిస్ట్‌‌గా నటించా. ఫుల్‌‌ లెంగ్త్‌‌ ఎంటర్‌‌‌‌టైనర్ కనుక వాళ్ల కష్టాలను తెరపై చూపించలేదు. కొత్త కథ కాకపోయినా చెప్పే పాయింట్‌‌ కొత్తగా ఉంటుంది. ముఖ్యంగా మేకింగ్, స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటాయి. హీరో క్యారెక్టరైజేషన్‌‌ చాలా డిఫరెంట్‌‌గా అనిపిస్తుంది.

ఇప్పటివరకూ వక్కంతం వంశీ రాసిన పాత్రల్లో ఇది బెస్ట్‌‌ అని చెప్పొచ్చు. తండ్రీ కొడుకు మధ్య సెంటిమెంట్‌‌ కాకుండా ఎంటర్‌‌‌‌టైన్మెంట్‌‌ మాత్రమే ఉంటుంది. ఒక కమర్షియల్ సినిమాలో హీరోయిన్‌‌ క్యారెక్టర్‌‌‌‌ ఎలా ఉంటుందో శ్రీలీల పాత్ర అలా ఉంటుంది. రాజశేఖర్ గారి క్యారెక్టర్ సెకెండాఫ్‌‌లో వస్తుంది. ఆయన వచ్చాక సినిమా నెక్స్ట్‌‌ లెవెల్‌‌కు వెళ్తుంది. పోలీస్‌‌, ఫాదర్‌‌‌‌ క్యారెక్టర్స్‌‌లో ఎక్కువగా మనం చూసిన సంపత్‌‌ గారు ఇందులో చాలా కొత్తగా కనిపిస్తారు. రావు రమేష్ గారి పాత్ర తర్వాత సంపత్ గారి పాత్ర ఎక్కువ కనెక్ట్ అవుతుంది. తెలుగులో హ్యారీస్ జయరాజ్ గారు చేసిన చిత్రాల్లో పాటలు సూపర్ హిట్ అయినప్పటికీ సినిమాలు  మెప్పించలేదు.

ఆ సెంటిమెంట్‌‌తో మన వాళ్లు ఆయన్ను ఎక్కువగా తీసుకోలేదేమో. దాన్ని ఈ సినిమాతో బ్రేక్ చేస్తామనే నమ్మకముంది. ఇలాంటి పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం ఈ మధ్య కాలంలో రాలేదని నా అభిప్రాయం . ఇక వెంకీ కుడుముల డైరెక్షన్‌‌లో నేను నటిస్తున్న చిత్రం మూడు వారాలు షూట్ చేశాం. అలాగే వేణు శ్రీరామ్ గారి తమ్ముడు సినిమా రెండు వారాలు షూట్ చేశాం. ఈ రెండూ సమాంతరంగా చేస్తాను. ఇతర భాషల్లో నటించాలనే ఆలోచన లేదు. తెలుగులోనే సినిమాలు చేస్తాను. అవి నచ్చితే ఇతర భాషల్లోకి డబ్ చేస్తాం. అంతే తప్ప ‘ఆర్ఆర్ఆర్‌‌’ లాంటి భారీ చిత్రాలు చేయాలని, ఆస్కార్ వరకు వెళ్లాలనే పెద్ద కోరికలు నాకు లేవు’.