Raj Tarun: మాస్‌ ఆడియన్సే లక్ష్యంగా రాజ్ తరుణ్ మూవీ.. ఆకట్టుకుంటున్న ‘రామ్ భజరంగ్’ గ్లింప్స్‌

Raj Tarun: మాస్‌ ఆడియన్సే లక్ష్యంగా రాజ్ తరుణ్ మూవీ.. ఆకట్టుకుంటున్న ‘రామ్ భజరంగ్’ గ్లింప్స్‌

రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘రామ్ భజరంగ్’.  సి.హెచ్. సుధీర్ రాజు దర్శకుడు. ‘గదర్ 2’ ఫేమ్  సిమ్రత్ కౌర్, ‘బిచ్చగాడు’ ఫేమ్ సట్న టీటస్, ఛాయా దేవి, మనసా రాధాకృష్ణన్ హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్నారు. స్వాతి సుధీర్, డా.రవి బాల నిర్మిస్తున్నారు.  మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

శుక్రవారం ఈ మూవీ వీడియో గ్లింప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాజ్ తరుణ్ మాట్లాడుతూ ‘ఎయిటీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వస్తున్న ఈ చిత్రంలో చాలా డిఫరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపించబోతున్నా. దర్శకుడు రాసుకున్న స్క్రిప్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాలా బాగుంది’ అని చెప్పాడు.

యాక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ అద్భుతంగా ఉంటాయని, కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని మరో హీరో సందీప్ మాధవ్ చెప్పాడు. ఒక మంచి మాస్ సినిమా చెయ్యాలని ఈ కథ రాసుకోగా,  రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ పోటీపడి నటించారని దర్శకుడు సుధీర్ రాజు తెలిపాడు.

నెగిటివ్ షేడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్న క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నటించానని వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. చిత్రీకరణ పూర్తి కావచ్చిన ఈ చిత్రాన్ని త్వరలో తెలుగు, తమిళ, కన్నడ,  మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నామని నిర్మాతలు స్వాతి సుధీర్, రవి బాల  చెప్పారు. హీరోయిన్ మానస రాధాకృష్ణ, డీవోపీ అజయన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విన్సెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు.