చిరంజీవి మౌనం వీడితే భరించలేరు : రాంచరణ్

చిరంజీవి మౌనం వీడితే భరించలేరు : రాంచరణ్

చిరంజీవి, రవితేజ నటించిన వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ మూవీ భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో హన్మకొండలో విజయోత్సవ వేడుక నిర్వహించారు. ఈ ఈవెంట్కు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి మౌనంగా, సౌమ్యంగా ఉంటారని అందరికీ తెలుసని.. కానీ ఆయన మౌనం వీడితే భరించలేరన్నారు. చిరంజీవి మౌనంగా ఉంటారేమో కానీ తాము కాదని.. ఆయన్ని ఏమన్నా అంటే ఊరుకోమని చెప్పారు. చిరంజీవిని అనాలంటే ఆయన కుటుంబసభ్యులైనా లేదా అభిమానులైనా అయి ఉండాలని స్పష్టం చేశారు.