హీరో రామ్ ఇంట్లో విషాదం

V6 Velugu Posted on May 18, 2021

విజ‌య‌వాడ‌: ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్‌, హీరో రామ్ ఇంట విషాదం చోటు చేసుకుంది. రవికిశోర్ తండ్రి, రామ్ తాతయ్య పోతినేని సుబ్బారావు అనారోగ్యంతో మంగళవారం ఉదయం విజయవాడలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. తాతయ్య మరణంతో రామ్ భావోద్వేగానికి లోనయ్యారు. తమ కుటుంబం ఈస్థాయికి రావడం వెనుక తాతయ్య కృషి, శ్రమను ఆయన గుర్తు చేసుకున్నారు. స్రవంతి రవికిశోర్ సోదరుడు మురళి కుమారుడు హీరో రామ్ అనే  సంగతి తెలిసిందే.

తాత‌య్య మ‌ర‌ణం విషయాన్ని ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేసిన రామ్.. ఓ ఎమోషనల్‌ ట్వీట్‌ పెట్టాడు. విజయవాడలో ఓ లారీ డ్రైవర్‌గా ప్రారంభమైన ఉన్నత శిఖరాలకు వెళ్లిన మీ జీవితం మాకు ఎన్నో పాఠాలను నేర్పింది. నువ్వు లారీ టైర్లపై నిద్రిస్తూ.. ఫ్యామిలీకి అన్ని వసతులు ఏర్పాటు చేశావు. నీది రాజు లాంటి మనసు. జేబులో ఉన్న డబ్బుని బట్టి ఎవరూ ధనవంతులు కాలేరని,  మంచి మనస్సు వల్లే ప్రతిఒక్కరూ ధనవంతులు అవుతారని మీరే మాకు నేర్పించారు. మీ పిల్లల కోసం పెద్ద కలలు కని వాటిని నెరవేర్చినందుకు థ్యాంక్స్‌ తాతయ్య.  మీ మరణవార్త నన్ను ఎంతో కలచివేసింది. నా హృదయం ముక్కలైంది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నా అని రామ్‌ ట్వీట్‌ చేశాడు.

Tagged VIjayawada, death, hero ram, grand father,

Latest Videos

Subscribe Now

More News