మా వింత గాథ వినుమా, కృష్ణ అండ్ హిజ్ లీల, డిజె టిల్లు.. ఇప్పుడు టిల్లు స్క్వేర్ వంటి వెరైటీ కాన్సెప్ట్స్‌తో టాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda). ఇదిలా వుంటే..సిద్దు కెరీర్లో డిజె టిల్లు లాంటి సాలిడ్ హిట్ పడడం..యూత్లో తన వెరైటీ స్లాంగ్ తో ఇచ్చిపడేసే యాక్టర్ అంటే..సిద్దు అని చెప్పుకోవాల్సిందే. డిజె టిల్లు మూవీలోని రాజా రాజా ఐటమ్ రాజా, రోజా రోజా క్రేజీ రోజా, లేజీ లేజీ గుండెల్లోనా, డిజె డిజె కొట్టేసిందా..పటాస్ పిల్ల పటాస్ పిల్ల’..ఇక డిజె టిల్లు వంటి సాంగ్స్ తో యూత్లో మంచి ర్యాపో క్రియేట్ చేసుకున్నాడు.
అసలు విషయానికి వస్తే..ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ రెమ్యూనరేషన్ ఇప్పుడు పది కోట్లకు చేరిపోయిందని టాక్ వినిపిస్తోంది. ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అంటే..సిద్దు కెరీర్ ఎంత స్ట్రాంగ్ గా క్రియేట్ చేసుకున్నాడో అర్ధమయితుంది.
ప్రసెంట్ సిద్దు చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్టులు వున్నాయి. ఈ రెండు ప్రాజెక్ట్ లకు పది కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని తెలుస్తోంది. ఇక త్వరలో రిలీజ్ కు రెడీ గా ఉన్న..టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్ అయితే..తన డిమాండ్ మరో లెవెల్లో ఉండబోతున్నట్లు సమాచారం. అసలు చిన్న హీరోగా ఇండిస్టీ కి వచ్చి..ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోస్ కు సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడంటే గ్రేట్ అని చెప్పుకోవాలి.
ఇక రీసెంట్గా..బడా హీరోల రెమ్యూనరేషన్ విషయంలో ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పెరిగిన సినిమా నిర్మాణ వ్యయంలో హీరోలు తీసుకునేది 20 నుంచి 25 శాతం మాత్రమే అంటూ..మాట్లాడిన తీరు చాలా వరకు రుచించలేదు.
అంతెందుకు..టాలీవుడ్ టాప్ హీరోస్ అయిన ..బాలయ్య, చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాలకు రూ.130కోట్ల నుంచి రూ.150 కోట్ల జరుగుతుండగా..ఇందులో బాలకృష్ణ రెమ్యూనరేషన్ పాతిక కోట్లు తీసుకుంటే, అదే రేంజ్ బిజినెస్ జరిగే మెగాస్టార్ చిరంజీవి మాత్రం రూ. 50 కోట్లు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అంతే బిజినెస్ జరిగే పవర్ స్టార్ కూడా రూ.65 కోట్లు తీసుకుంటారని టాలీవుడ్ ఆడియాన్స్ మదిలో మెదిలే మాటగా కనిపిస్తోంది. మరి ఇలా చూసుకుంటే..రూ.150 కోట్ల బిజినెస్ కు 20 నుండి 25 శాతం అంటే రూ.30 కోట్లు మాత్రమే తీసుకోవాలని సినీ క్రిటిక్స్ మాట్లాడుకుంటున్నారు.
