స్టార్ బాయ్ సిద్దు హీరోగా కొత్త సినిమా.. టైటిల్ చాలా డిఫరెంట్గా ఉంది

స్టార్ బాయ్ సిద్దు హీరోగా కొత్త సినిమా.. టైటిల్ చాలా డిఫరెంట్గా ఉంది

టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ(Siddu jonnalagadda) హీరోగా మరో కొత్త సినిమా మొదలైంది. ప్రముఖ రచయిత కోన వెంకట్(Kona Venkat) సోదరి నీరజ కోన(Neeraja kona) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమా నుండి తాజాగా అనౌన్స్మెంట్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.   

ఈ మూవీకి తెలుసు కదా అనే టైటిల్‌ ఫిక్స్ చేశారు మేకర్స్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో.. కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి, టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటించనున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి.. యువరాజ్‌ సినిమాటోగ్రఫర్‌గా పనిచేస్తుండగా.. నేషనల్ అవార్డు విన్నర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా చేస్తున్నారు.  ఇక ఈ మూవీ రెగ్యులర్‌ షూటింగ్ నవంబర్ 15 నుండి మొద‌లు కానుందని సమాచారం.

దీనితో పాటి సిద్దు మరో రెండు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. అందులో ఒకటి బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కాగా.. డీజే టిల్లు కు సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వైర్ ఒకటి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ రెండు సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.