టాప్ టెన్‌‌ యాక్షన్ మూవీస్‌‌లో హరోం హర : సుధీర్ బాబు

టాప్ టెన్‌‌ యాక్షన్ మూవీస్‌‌లో హరోం హర : సుధీర్ బాబు

‘హరోం హర’ చిత్రంలో తను పోషించిన పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోతుందని చెప్పారు సుధీర్ బాబు.  జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుమంత్ జి నాయుడు నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా సుధీర్ బాబు చెప్పిన విశేషాలు.

‘‘జ్ఞానసాగర్ కథ చెప్పినప్పుడు షాక్ అయ్యా. ‘సెహరి’ లాంటి లవ్ స్టోరీ తర్వాత ఇలాంటి యాక్షన్ స్టోరీ చెబుతాడని అనుకోలేదు. కమర్షియల్ సినిమా చేసినా..  కథలో నుంచి హీరో పుట్టడమే నా ప్రయారిటీ. ఇందులో కథలోనే ఆ కమర్షియాలిటీ  ఉంటుంది. బ్యాక్‌‌డ్రాప్ చాలా ఫ్రెష్‌‌గా ఉంటుంది. జేమ్స్ బాండ్ లాంటి క్యారెక్టర్.. చాలా హెవీ వెపన్స్, గాడ్జెట్స్ తయారు చేస్తుంటారు. అలాంటి క్యారెక్టర్ మన ఊర్లో ఉంటే. మన పక్కింటి కుర్రాడిలా తను గన్స్ తయారు చేస్తే ఎలా నాటుగా ఉంటుందో చూడొచ్చు. జేమ్స్ బాండ్ బ్యాక్ డ్రాప్ ఇన్ కుప్పం అనొచ్చు.  ఇందులో నా  డైలాగ్స్‌‌కి కూడా మేనరిజం ఉంటుంది. ‘ఇగ సెప్పేదేమ్ లేదు.. సేసేదే’ అనే డైలాగ్ సినిమాలో చాలా చోట్ల వస్తుంది. 

ఇప్పటివరకు వచ్చిన  టాప్ టెన్ యాక్షన్ సినిమాల్లో ఇది కూడా ఉంటుంది. ప్రేక్షకులకు కొత్త వరల్డ్ చూసిన ఫీల్ వస్తుంది. ట్రైలర్ చూసి మహేష్ గారు కూడా ఇదే అన్నారు. యాక్షన్ లవర్స్‌‌కి బాగా నచ్చుతుంది. మాళవిక శర్మ మంచి పెర్ఫార్మర్. భాష నేర్చుకుని మరీ నటించింది. అలాగే సునీల్ స్ట్రాంగ్ రోల్‌‌లో కనిపిస్తారు. చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ సినిమాకు బాగా ప్లస్ అవుతుంది. ఇక  ప్రొడ్యూసర్స్ స్టోరీ మార్కెట్‌‌ని బట్టి సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ఇప్పటివరకు చాలా తప్పులు చేశా.. ఇందులో మాత్రం  ఒక్క తప్పు కూడా ఉండదు. ఆడియెన్స్‌‌కు గుర్తుండిపోయేలా సినిమా ఉంటుంది. అలాగే ఈ చిత్రానికి సీక్వెల్‌‌ కూడా ఉంటుంది’’.