బాలా మూవీపై హీరో సూర్య క్లారిటీ

బాలా మూవీపై హీరో సూర్య క్లారిటీ

విలక్షణ నటుడు సూర్య, క్రియేటివ్ దర్శకుడు బాలా కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతుంది. 18 ఏళ్ల తర్వాత హీరో సూర్యతో డైరెక్టర్ బాలా సినిమా తీయబోతున్నాడు. బాలా దర్శకత్వంలో సూర్య ..శివ పుత్రుడు చిత్రంలో నటించాడు. 2003లో వచ్చిన ఈ మూవీ..అప్పట్లో సంచలనం సృష్టించింది. సూర్య నటన ఈ చిత్రంలో హైలెట్. శివపుత్రుడు బాలాతోపాటు సూర్యకు మంచి పేరును తెచ్చింది. మరోసారి ఈ క్రేజీ కాంబో రిపీట్ కానుండటంతో ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు. 

క్యాన్సిల్ అంటూ వార్తలు...సూర్య క్లారిటీ..
డైరెక్టర్ బాలాతో చేయాల్సిన మూవీ క్యాన్సిల్ అయిందంటూ వచ్చిన వార్తలకు హీరో సూర్య చెక్ పెట్టాడు. ఆ వార్తలు నిజం కావని తేల్చి చెప్పాడు.  బాలాతో తన సినిమా షూటింగ్‌ పనులు జరుగుతున్నట్లుగా సూర్య చెప్పుకొచ్చాడు. అయితే షూటింగ్ ప్రారంభం కావడానికి కాస్త సమయం పడుతుందని వెల్లడించారు. ఇద్దరి కాంబినేషన్లో త్వరలో మంచి సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని సూర్య హామీ ఇచ్చాడు. 

విభేదాలు నిజం కావు..
స్క్రిప్ట్ విషయంలో సూర్య, బాలాకు మధ్య విభేదాలు చెలరేగినట్లు వార్తలు షికారు చేశాయి. స్క్రిప్ట్ విషయంలో సూర్య మార్పులు, చేర్పులు చేశాడని..అందుకు బాలా ఒప్పుకోకపోవడంతో సూర్య.. ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడని గాసిప్స్ వినిపించాయి. ఇవన్నీ తప్పుడు వార్తలని సూర్య కొట్టిపారేశాడు. ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాడు. బాలా డైరెక్షన్లో తన సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయని వెల్లడించాడు. మూవీ గురించే స్వయంగా సూర్యనే క్లారిటీ ఇవ్వడంతో..ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. వీరిద్దరి కాంబోలో సినిమా రావడం ఖాయమన్న అభిప్రాయానికి వచ్చేశారు. 

సూర్యకు ఇది స్పెషల్ మూవీ కానుందా..
సూర్య- బాలా కాంబినేషన్లో రాబోతున్న ఈ మూవీ స్పెషల్గా ఉండబోతుందని తెలుస్తోంది. సూర్య కోసం బాలా మంచి కథ రాశాడని సమాచారం.  సూర్య కెరీర్లోనే ఈ చిత్రం స్పెషల్గా ఉండబోతుందని అంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్స్‌గా జ్యోతికతో పాటు ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి కూడా నటించనున్నారని టాక్. మరో నటి ఐశ్వర్య రాజేష్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంట‌ర్‌టైన్మెంట్ నిర్మించనుండగా... జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారని తెలుస్తోంది. 

పాన్ ఇండియా మూవీ కాదా..?
డైరెక్టర్ బాలా అంటే డిఫ్రెంట్ కథలకు పెట్టింది పేరు. విషాద చిత్రాలు తీయడంలో బాలాకు ఎవరు సాటిలేరని చెప్పాలి.  బాలా తీసిన చిత్రాలు ప్రేక్షకుడి మనసుకు హత్తుకుంటాయి. అందుకే ఆయన సినిమాలు దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందుతాయి. అవార్డుల పంట పండిస్తాయి. ఇటు సూర్యకు తమిళంలోనే కాదు..దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. టాలీవుడ్,బాలీవుడ్లో సూర్య మూవీ వచ్చిందంటే చాలు పండగ వాతావరణం ఉంటుంది.  అయితే తాజాగా సూర్య-బాలా మూవీ పాన్ ఇండియా రేంజ్లో ఉండబోతుందని అభిమానులు అనుకున్నారు. కానీ..ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసే ఉద్దేశ్యం బాలాకు లేదని తెలుస్తోంది.