దేశ గొప్పతనాన్ని చాటేలా..ది వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పెరేడ్

దేశ గొప్పతనాన్ని చాటేలా..ది వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పెరేడ్

అమెరికాలోని న్యూయార్క్‌‌‌‌లో జరిగిన  43వ ‘ది వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పెరేడ్’ కార్యక్రమంలో  హీరో విజయ్ దేవరకొండ అతిథిగా  పాల్గొన్నాడు. ఆగస్టు 17న   మాడిసన్ అవెన్యూలో  సర్వే భవంతు సుఖినః అనే థీమ్‌‌‌‌తో జరిగిన ఈ వేడుకలో ప్రవాస భారతీయులతో పాటు  స్థానిక అమెరికన్స్ కూడా హాజరయ్యారు. అక్కడి ఎంపైర్ బిల్డింగ్ మన జాతీయ జెండాలోని మూడు రంగుల విద్యుత్ కాంతులతో వెలిగిపోయింది. 

ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ మువ్వన్నెల లైటింగ్‌‌‌‌ను విజయ్ దేవరకొండ స్విచ్చాన్ చేశాడు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ ‘ప్రవాస భారతీయ సోదరులు మన దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుతున్నారు.  దేశం కోసం వీళ్లు చేస్తున్న కాంట్రిబ్యూషన్ చూస్తుంటే గర్వంగా ఉంది. మన పెద్దలు ఎంతోమంది చేసిన త్యాగాలు, వారి కృషి వల్లే మనం ఈ రోజు ఇంత ఆనందంగా జీవించగలుగుతున్నాం’ అని చెప్పాడు.