సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పీడ్‌‌‌‌‌‌‌‌లో వర్క్ చేసుకుంటూ పోతున్న విక్రమ్

సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పీడ్‌‌‌‌‌‌‌‌లో వర్క్ చేసుకుంటూ పోతున్న విక్రమ్

విక్రమ్ అనారోగ్యంతో హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో అడ్మిట్ అయ్యాడనే వార్త అందరినీ ఎంత కంగారుపెట్టిందో తెలిసిందే. అయితే వెంటనే డిశ్చార్జ్ కావడం, తనకేం కాలేదని విక్రమ్ చెప్పడంతో అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. విక్రమ్‌‌‌‌‌‌‌‌ కూడా ఎప్పటిలా సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పీడ్‌‌‌‌‌‌‌‌లో వర్క్ చేసుకుంటూ పోతున్నాడు. ఈ నెలలో ‘కోబ్రా’, వచ్చే నెలలో ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విక్రమ్.. రీసెంట్‌‌‌‌‌‌‌‌గా పా.రంజిత్‌‌‌‌‌‌‌‌తో పని చేయడానికి ఓకే చెప్పాడు. ఈ సినిమా గురించి ఓ ఇంటరెస్టింగ్ న్యూస్ తెలిసింది. ఇది 1800 కాలానికి చెందిన కథట. త్రీడీ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లో తీయబోతున్నారట. ఈ నెలాఖరులో షూటింగ్ మొదలు కాబోతోంది. ప్రస్తుతం చెన్నైలో ఓ భారీ సెట్‌‌‌‌‌‌‌‌ను నిర్మిస్తున్నారు. ఈ విషయాల్ని దర్శకుడే తాజా ఇంటర్వ్యూలో కన్‌‌‌‌‌‌‌‌ఫర్మ్ చేశాడు. కేజీయఫ్ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో సాగుతుందని సమాచారం. ఇక ఎప్పటి నుంచో ఆగిపోయిన ‘ధృవనక్షత్రం’ మూవీ కూడా త్వరలో సెట్స్‌‌‌‌‌‌‌‌కి వెళ్లబోతోంది. రీసెంట్‌‌‌‌‌‌‌‌గా విక్రమ్‌‌‌‌‌‌‌‌ని దర్శకుడు గౌతమ్‌‌‌‌‌‌‌‌ మీనన్ కలవడంతో ఈ విషయం బైటికొచ్చింది. ఎప్పుడో 2017లో మొదలైన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఇంతవరకు పూర్తి కాలేదు. తానెంతో ఇష్టపడిన మూవీ కావడంతో విక్రమ్‌‌‌‌‌‌‌‌కి దీనిపై ప్రేమ పోలేదు. ఎలాగైనా కంప్లీట్ చేసి తీరాలనే పట్టుదలతో ఉన్నాడు. ఆ సమయం ఇప్పటికి వచ్చింది. మిగిలిన పోర్షన్‌‌‌‌‌‌‌‌ని షూట్‌‌‌‌‌‌‌‌ చేసేసి, పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసి, నెక్స్ట్ ఇయర్ ప్రారంభంలో మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఈసారైనా అనుకున్నది అనుకున్నట్టు జరిగితే మంచిదే మరి!