వీడియో: షూటింగ్ లో గాయపడ్డ హీరో విశాల్

V6 Velugu Posted on Jul 21, 2021

హైదరాబాద్: ప్రముఖ తెలుగు, తమిళ హీరో విశాల్ సినిమా షూటింగ్ లో తీవ్రంగా గాయపడ్డాడు. శరవణన్ దర్శకత్వంలో ‘‘నాట్ ఎ కామన్ మ్యాన్’’ సినిమా షూటింగ్ క్లైమాక్స్ పార్ట్ హైదరాబాద్ లో షూట్ చేస్తున్నారు. యాక్షన్ ప్రధాన ఇతివృత్తంతో వస్తున్న ఈ సినిమాలో హీరో విశాల్ లుక్ భిన్నంగా ఉంటుంది. షూటింగ్ సమయంలో స్టంట్ మెన్ల మధ్య సమన్వయ లోపంతో ఆయన బలంగా గోడను ఢీకొట్టి పడిపోయాడు. గతంలో కూడా ఒకసారి ఇదే సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన గాయపడిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆయన  తలకు, కంటికి స్వల్ప గాయాలయ్యాయి. విశ్రాంతి తర్వాత లాక్ డౌన్ రావడంతో షూటింగ్ కు బ్రేకప్ చెప్పాల్సి వచ్చింది. తాజాగా హైదరాబాద్ లో కీలకమైన క్లైమాక్స్ సీన్లు షూట్ చేస్తుండగా హీరో విశాల్ గోడను ఢీకొట్టుకుని పడిపోయాడు. ఆయన వెన్నముకకు బలంగా గాయాలైనట్లు తెలుస్తోంది. షూటింగ్ సిబ్బంది హుటాహుటిన విశాల్ ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. 


 

Tagged , Collywood hero Vishal, hero vishal injurred, tamil movie, director sharavanan movie, claimax fight scene, \\\\\\\'not a common man\\\\\\\' movie

Latest Videos

Subscribe Now

More News