మొత్తం 12 సార్లు పెళ్లిళ్లు చేశారు.. మా నాన్నకు ఆ అలవాటు ఉండేది!

మొత్తం 12 సార్లు పెళ్లిళ్లు చేశారు.. మా నాన్నకు ఆ అలవాటు ఉండేది!

తమిళ స్టార్ హీరో విశాల్(Vishal) ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోని(Mark Antony). ఈ సినిమా సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి అంచనాలు మధ్య రిలీజైన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి కూడా పాజిటీవ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమా చూసిన వాళ్ళు సూపర్ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా.. రీసెంట్ గా మార్క్ ఆంటోనీ ప్రమోషన్స్ లో పాల్గొన్న విశాల్ సినిమా గురించి అండ్ తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. అంతేకాదు తన పెళ్లి గురించి కూడా చెప్పుకొచ్చాడు విశాల్.. మాములుగా నేను నాపై వచ్చే రూమర్స్ అండ్ కాంట్రావర్సి ల గురించి స్పందించను కానీ.. ఇటీవల ఒక విషయంపై ఒక ట్వీట్‌ చేయాల్సివచ్చింది. అదేంటంటే.. మళయాళ  నటి లక్ష్మీ మేనన్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ విషయంలో నేను స్పందించకపోతే.. అది ఆమె వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపిస్తుంది. గతంలో కూడా చాలా నేను మందిని పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. మొత్తం నా 19ఏళ్ల కెరీర్‌లో ఇప్పటివరకూ 12మందిని పెళ్లి చేసుకున్నట్లు వార్తలు రాశారు అంటూ చెప్పుకొచ్చాడు విశాల్.