చంద్రబాబు అరెస్ట్ భయం కలిగించింది.. హీరో విశాల్ షాకింగ్ కామెంట్స్

చంద్రబాబు అరెస్ట్ భయం కలిగించింది.. హీరో విశాల్ షాకింగ్ కామెంట్స్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్ పై తమిళ హీరో విశాల్(Vishal) సంచలన కామెంట్స్ చేశారు. ఆయనను అరెస్ట్ చేయడం భయాన్ని కలిగించిందని, కాస్త ఆలోచిస్తే బాగుండేది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. విశాల్ చేసిన ఈ కామెంట్స్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. విశాల్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోనీ. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సూపర్ సక్సెస్ అయ్యింది. చాలా కాలంగా హిట్ కోసం చూస్తున్న విశాల్ కు ఈ సినిమాతో సాలిడ్ హిట్ పడింది. దీంతో హైదరాబాద్ లో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు చిత్ర యూనిట్. ఈ సందర్బంగా విశాల్ చంద్రబాబు అరెస్ట్ గురించి మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసే ముందు కొంచెం ఆలోచించి ఉంటే బాగుండేది. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే.. మనలాంటి సామాన్యులకు ఒకరకమైన భయం కలగడం సహజం. ఆయన వ్యతిరేకంగా పక్కా ఆధారాలతో చూపించి అరెస్ట్ చేసి ఉంటే బాగుండేది.. అంటూ చెప్పుకొచ్చారు హీరో విశాల్.

ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అయితే విశాల్ ఇంతకుముందు చాలాసార్లు తనకు జగన్ అంటే ఇష్టమని చెప్పారు. ఇందులో భాగంగానే.. ఆయన చంద్రబాబుకు వ్యతిరేకంగా కుప్పం నుండి పోటీ చేయనున్నాడనే వార్తలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ పై విశాల్ ఈ రకంగా స్పందించడం వైసీపీలో చర్చనియ్యాంశం అయ్యింది.