
రాకింగ్ స్టార్ యష్(Rocking star yash) నెక్స్ట్ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ తో పాటు.. ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్ చాఫ్టర్2 (KGF Chapter2) రిలీజై ఏడాదిపైనే అయినా ఇప్పటికి వరకు తన తరువాత సినిమాని ప్రకటించలేదు ఈ హీరో. మధ్యలో కొన్ని వార్తలు వినిపించినా.. అవేవీ కార్యరూపం దాల్చలేదు.
ఇక తాజాగా యాష్ నెక్స్ట్ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మాస్ హీరో తన తరువాతి సినిమా కోసం ఒక క్లాస్ సబ్జెక్టును సెలెక్ట్ చేసుకున్నాడట. అంతేకాదు ఈ సినిమా కోసం ఒక లేడీ డైరెక్టర్ వర్క్ చేయనుందట. ఆమె మరెవరో కాదు గీతూ మోహన్ దాస్(Geethu Mohandas). ఈ దర్శకురాలు న్యరేట్ చేసిన రొమాంటిక్ స్టోరీ యష్ కు బాగా నచ్చిందట. అందుకే ఈ ప్రాజెక్టు కు వెంటనే ఓకే చెప్పేశాడట యష్ .
అయితే ఈ న్యూస్ తెల్సుకున్న యష్ ఫ్యాన్స్ కాస్త కంగారు పడుతున్నారట. ఎందుకంటే.. మాస్ హీరోగా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకున్న తరువాత క్లాస్ సినిమాతో మల్లి ఆ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం అంటే చాలా కష్టం. ప్రభాస్(Prabhas) నటించిన రాధే శ్యామ్(Radhe shyam) సినిమాను ఇందుకు ఎగ్జాంఫుల్ గా చూపిస్తున్నారు. మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా భాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఇప్పుడు క్లాస్ మూవీతో వస్తున్న యష్ కు కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుందేమో అని కంగారు పడుతున్నారు.
మరి మాస్ హీరో చేస్తున్న ఈ క్లాస్ మూవీ ప్రేక్షకులను, మరీ ముఖ్యంగా యష్ ఫ్యాన్స్ ను ఏమేరకు మెప్పిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.