హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. నగర శివారు నార్సింగిలో 4.5 గ్రాముల హెరాయిన్ పట్టుబడింది. ఇద్దరి స్మగ్లర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆదివారం (నవంబర్ 23) మై హోమ్ అవతార్ లేబర్ క్యాంప్ దగ్గర హెరాయిన్ విక్రయిస్తుండగా స్మగ్లర్లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు. వెస్ట్ బెంగాల్ నుంచి హైదరాబాద్‌కు హెరాయిన్ స్మగ్లింగ్ చేస్తోన్నట్లు గుర్తించారు.
వెస్ట్ బెంగాల్‌కు చెందిన దాల్మియా, లక్కన్ బర్మాలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు నార్సింగి పోలీసులు. డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. యువత డ్రగ్స్‌కు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు.
