Anushka: లాఫింగ్ డిజార్డర్ వ్యాధితో బాధపడుతున్న అనుష్క.. అంటే ఏంటో తెలుసా?

Anushka: లాఫింగ్ డిజార్డర్ వ్యాధితో బాధపడుతున్న అనుష్క.. అంటే ఏంటో తెలుసా?

సౌత్ బ్యూటీ అనుష్క ఓ వింత వ్యాధితో బాధపడుతున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతుండటంతో ఆమెకు ఏమైంది? అసలు లాఫింగ్ డిజార్డర్ అంటే ఏంటి? దాంతో ఏమైనా ప్రమాదమా అనే విషయాలు తెలుసుకువడానికి ట్రై చేస్తున్నారు అనుష్క ఫ్యాన్స్. మరి లాఫింగ్ డిజార్డర్ అంటే ఏంటి? దాని లక్షణాలు, మిగతా వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్క ఈ వ్యాధి గురించి చెప్పుకొచ్చారు. నాకు చాలా కాలంగా లాఫింగ్ డిజార్డర్‌ సమస్య ఉంది. ఈ వ్యాధి కారణంగా ఒక్కసారి నవ్వడం మొదలుపెడితే.. 15 నుంచి 20 నిమిషాల వరకు అలా నవ్వుతూనే ఉండిపోతాను. షూటింగ్ సమయాల్లోనూ ఇలా చాలా సార్లు జరిగింది. చాలా నవ్వుతు అలానే ఉండిపోయేదాన్నీ. కొన్నిసార్లు నవ్వుతూ కిందపడి దొర్లాను కూడా.. అంటూ చెప్పుకొచ్చారు అనుష్క.

నిజాంనికి ఈ వ్యాధి గురించి చాలా మందికి తెలియదు. లాఫింగ్ డిజార్డర్ ని సూడోబుల్బార్ ఎఫెక్ట్ లేదా పీబీఏ అను కూడా అంటారు. ఈ వింత వ్యాధి ఉన్నవారు ఆపకుండా నవ్వడం లేదా ఏడవడం చేస్తారు. మెదడు గాయం లేదా నరాల పరిస్థితి కారణంగా ఈ వ్యాధి వస్తుందట. కానీ, ఈ వ్యాధి వల్ల ఎలాంటి ప్రమాదం ఉందని డాక్టర్స్ వివరించారు. ప్రమాదం ఏమీ లేదని తెలియడంతో అనుష్క ఫ్యాన్స్ రిలాక్స్ అవుతున్నారు.