రజనీకాంత్ సినిమాలో మీనా..

రజనీకాంత్ సినిమాలో మీనా..

చాన్నాళ్ల తర్వాత..

చైల్డ్ ఆర్టిస్ట్‌‌‌‌‌‌‌‌గా కెరీర్ మొదలుపెట్టి టాప్‌‌‌‌‌‌‌‌ హీరోయిన్ రేంజ్‌‌‌‌‌‌‌‌కి ఎదిగింది మీనా. అప్పట్లో స్టార్ హీరోలందరి సరసన నటించి సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసింది. పెళ్లితో కాస్త గ్యాప్‌‌‌‌‌‌‌‌ తీసుకున్నా.. కొన్నాళ్ల తర్వాత మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. తనకి తగిన పాత్రల్ని ఎంచుకుంటూ అడపా దడపా తెరపై మెరుస్తోంది. ప్రస్తుతం ఒక వెబ్‌ సిరీస్‌‌‌‌‌‌‌‌లో కూడా నటిస్తోంది. అయితే తాజాగా ఆమెని ఓ సూపర్బ్‌‌‌‌‌‌‌‌ ఆఫర్ వరించినట్లు తెలుస్తోంది. రజనీకాంత్ హీరోగా శివ రూపొందించే చిత్రంలో ఓ కీలక పాత్రకి మీనాని తీసుకున్నారట. రజనీ, మురుగదాస్‌ల ‘దర్బార్‌ ’ రిలీజ్‌‌‌‌‌‌‌‌కి రెడీ అవుతూ ఉండటంతో అతి త్వరలో ఈ సినిమాని సెట్స్‌ కి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ చిత్రంలో రజనీ రెండు పాత్రల్లో కనిపిస్తారట. సీనియర్ పాత్రకి జోడీగా మీనాను ఎంపిక చేశారని, యంగ్ రజనీ కోసం కీర్తి సురేష్‌‌తో చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. రజనీ, మీనాల జంట గతంలో మంచి విజయాలు
అందుకుంది. ఆ మ్యాజిక్ మళ్లీ రిపీటవుతుందేమో చూడాలి.