నేను పుట్టినప్పుడు నా ముఖం కూడా చూడాలనుకోలేదు : స్నేహ

నేను పుట్టినప్పుడు నా ముఖం కూడా చూడాలనుకోలేదు : స్నేహ

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు స్నేహ. సినీ రంగంలో రెండు దశాబ్దాలకు పైగా ఆమె తన ప్రయాణాన్ని కొనసాగించింది. ఇప్పటికీ అంతే గ్లామర్​తో ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఫ్యామిలీ సినిమాలతో మెప్పిస్తూనే తమిళంలోని స్టార్​ హీరోలందరితోనూ జోడీ కట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన చిన్నతనంలో ఎదురైన చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది. 

‘మా ఇంట్లో నలుగురు ఆడపిల్లలం. నేను చివరి దాన్ని. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. నాకు బదులుగా మగ పిల్లాడు పుట్టాలని మా బామ్మ కోరుకుంది. నేను పుట్టినప్పుడు నా ముఖం చూసేందుకు కూడా రాలేదు. ఆడపిల్లలమంతా ఎంతో వివక్ష నడుమ పెరిగాం. మా పెద్దన్నయ్య నన్నెంతో ఇబ్బంది పెట్టేవాడు. పనులన్నీ మాతోనే చేయించేవారు. ప్రశ్నిస్తే మేం మగాళ్లమంటూ పురుషాధికారం చూపేవారు’ అంటూ చెప్పుకొచ్చింది. 2012లో తమిళ నటుడు ప్రసన్నను స్నేహ వివాహం చేసుకుంది. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు.