డిగ్రీ,డిప్లొమా చేసిన వాళ్లకు గుడ్ న్యూస్ ..CHESSలో అప్రెంటీస్ పోస్టులు..

డిగ్రీ,డిప్లొమా చేసిన వాళ్లకు గుడ్ న్యూస్ ..CHESSలో అప్రెంటీస్ పోస్టులు..

డీఆర్​డీఓ అనుబంధ సంస్థ సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ (సీహెచ్ఈఎస్ఎస్ డీఆర్​డీఓ) అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 22. 

పోస్టుల సంఖ్య: 25.
పోస్టులు: గ్రాడ్యుయేట్ (డిగ్రీ) అప్రెంటీస్ 10, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్ 15. 
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బి.టెక్/ బీఈ, డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 2022, 2023, 2024 గ్రాడ్యుయేషన్/ డిప్లొమా పూర్తయిన వారు మాత్రమే అర్హులు. 2022 కంటే ముందు ఉత్తీర్ణత సాధించిన వారు అనర్హులు.  
అప్లికేషన్: ఆఫ్​లైన్ ద్వారా. డైరెక్టర్ సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ (సీహెచ్ఈఎస్ఎస్), డీఆర్​డీఓ, ఆర్​సీఐ క్యాంపస్, పోస్ట్ విజ్ఞాన కాంచా, హైదరాబాద్​– 500069 చిరునామాకు పంపించాలి. 
అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 02.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 22.
సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్​లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
పూర్తి వివరాలకు  drdo.gov.in 
వెబ్​సైట్​లో సంప్రదించగలరు.