చార్మినార్ చూడటానికి వెళ్లి చికెన్ తింటున్నారా..? అయితే ఇటో లుక్కేయండి !

చార్మినార్ చూడటానికి వెళ్లి చికెన్ తింటున్నారా..? అయితే ఇటో లుక్కేయండి !

హైదరాబాద్: హైదరాబాద్ ఆహార కల్తీ నిఘా టీం (H-FAST) చార్మినార్‌లో అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోడౌన్‌పై ఆకస్మిక తనిఖీలు చేసింది. కల్తీ ఆహార పదార్థాలను సీజ్ చేసింది. చార్మినార్‌లోని హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో నడుస్తున్న ఒక అక్రమ ఫాస్ట్ ఫుడ్ గోడౌన్‌పై ఆకస్మిక దాడి చేశారు. చార్మినార్‌లోని పంచ్ మొహల్లా, న్యూ లాడ్ బజార్‌లో ఉన్న 'M/s అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్ను H-FAST టీం తనిఖీ చేసింది.

తనిఖీ సమయంలో.. ఆహార పదార్థాలను అత్యంత అపరిశుభ్రమైన, ప్రమాదకరమైన పరిస్థితుల్లో తయారు చేయడం, నిల్వ చేయడం జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేసి ఇలా లాభార్జనే ధ్యేయంగా ఫుడ్ బిజినెస్ చేస్తున్న హోటల్స్పై, రెస్టారెంట్లపై కఠిన చర్యలు ఉంటాయని H-FAST టీం తెలిపింది.

సుమారు 110 కిలోల తయారైన ఫ్రైడ్ చికెన్, 6 టిన్నుల లూజ్ వంట నూనె (ఒక్కొక్కటి 15 లీటర్లు), కృత్రిమ రసాయన ఆహార రంగులను.. ఈ అక్రమ కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇటువంటి కల్తీ, అపరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్, వాంతులు, విరేచనాల బారిన పడే ప్రమాదం ఉంది.

ALSO READ : తెలంగాణ కుర్రాడి టాలెంట్‌కు దేశం ఫిదా..

జీర్ణకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, వాడిన నూనెనే పదేపదే వాడటం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. కృత్రిమ ఆహార రంగుల వల్ల అలర్జీలు, కాలేయంపై తీవ్ర ప్రభావం చూపే అనారోగ్యాల ముప్పున పడే ప్రమాదం ఉంది.