లేడీ సూపర్‌స్టార్ నయనతార కేవలం హీరోయిన్‌గానే కాకుండా, తన భర్త విగ్నేష్ శివన్‌తో కలిసి స్వయంగా నిర్మించిన లేటెస్ట్ మూవీ 'హాయ్'. యంగ్ హీరో క్యావిన్కి జోడీగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రానికి విష్ణు ఎడవణ్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ ఈ రోజు ( ఆగస్టు 28, 2026 ) థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చింది. మరి తమిళం, తెలుగులో రిలీజ్ చేసిన సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం..
కథేంటంటే..
తన జీవితంలో ప్రతీ అమ్మాయి చేతిలో రిజెక్ట్ అయ్యే అమాయకపు కుర్రాడు మైల్సామి అలియాస్ సుబ్రహ్మణ్యం (క్యావిన్). ఇంట్లో బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తుంటే భయపడి చెన్నై పారిపోతాడు. మరోవైపు తనపై అప్పుల భారం మోపి, ఇష్టం లేని పెళ్లి చేయాలని చూస్తున్న కుటుంబం నుంచి తప్పించుకుని భీమవరం నుంచి పారిపోతుంది ధైర్యవంతురాలు దేవయాని (నయనతార). అనుకోకుండా వీరిద్దరూ ఒకే చోట కలుస్తారు. వీరిద్దరి పరుగు, ఆ తర్వాత జరిగిన అబద్ధాల దొంగ ఆటలు, వీరి మధ్య చిగురించిన విచిత్రమైన ప్రేమకథే ఈ 'హాయ్'..!
ఎలా ఉందంటే..
సినిమాలో క్యావిన్, నయనతారల మధ్య వచ్చే కాంబినేషన్ సీన్స్, వారి ఆపోజిట్ క్యారెక్టరైజేషన్లు బాగా వర్కవుట్ అయ్యాయి. ముఖ్యంగా రిజెక్షన్ గురించి క్యావిన్కి నయన్ క్లాస్ పీకే ఎమోషనల్ సీన్, అలాగే పాకిస్తాన్ లవర్ ట్రాక్ ప్రేక్షకుల చేత నవ్వులు పూయిస్తాయి. ఒక అబద్ధాన్ని కవర్ చేయడానికి మైల్స్ వేసే ప్లాన్స్ థియేటర్లో కామెడీ పండిస్తాయి.
ఎవరెవరు ఎలా చేశారంటే?
అయితే, రొటీన్ అండ్ ప్రిడిక్టబుల్ స్టోరీలైన్ కావడం, సెకండ్ హాఫ్‌లో స్క్రీన్‌ప్లే సాగదీతగా అనిపించడం సినిమాకి పెద్ద మైనస్. సీనియర్ నటులు భాగ్యరాజ్, రాధికా శరత్‌కుమార్, ప్రభు వంటి దిగ్గజాలు ఉన్నప్పటికీ వారి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లభించలేదు. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందననను అందుకుంటుంది. జెన్ మార్టిన్ అందించిన సంగీతం పర్వాలేదు. రాజేష్ శుక్లా, లియోన్ బ్రిట్టోల సినిమాటోగ్రఫీ కలర్ఫుల్గా ఉంది. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ వహించి ఉంటే రన్ టైమ్ సమస్య తగ్గేది.
క్యావిన్ తన టైమింగ్‌తో నవ్వించగా, నయనతార తన మార్క్ నటనతో మెరిసింది. జెన్ మార్టిన్ అందించిన పాటలు, బిజీఎమ్ ఫ్రెష్‌గా ఉన్నాయి. రాజేష్ శుక్లా కెమెరా వర్క్ బాగుంది. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉంటే బాగుండేది. ఈ చిత్రాన్ని నయనతార, విఘ్నేష్ శివన్, ఎస్.ఎస్.లలిత్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు.
మొత్తానికి 'హాయ్' మూవీ కొన్ని నవ్వులు, రొటీన్ డ్రామాతో సాగే యావరేజ్ టైమ్‌పాస్ మూవీ అంటున్నారు ప్రేక్షకులు.. పెద్దగా అంచనాలు లేకుండా చూస్తే ఓ మోస్తరుగా అలరిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
