రక్షాబంధన్ వచ్చిందంటే చాలు... సామాన్యుల నుంచి సినీ సెలబ్రిటీల వరకు ప్రతీ ఒక్కరి ఇంట పండగ వాతావరణం నెలకొంటుంది. ఈరోజు ( ఆగస్టు 28, 2026 ) రక్షాబంధన్ వేడుకలు అంబరాన్నంటాయి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు స్టార్ సెలబ్రిటీలు తమ తోడబుట్టినవారితో రాఖీ పండగను అత్యంత వైభవంగా, అంతే క్రేజీగా జరుపుకున్నారు. సోషల్ మీడియాలో వారు షేర్ చేసిన బ్యూటిఫుల్ పిక్స్, వీడియోలు ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలిచాయి.
సినీ సెలబ్రిటీల రాఖీ పండగ సందడి
ఘట్టమనేని ఇంట్లో రాఖీ వేడుక ఎప్పుడూ ప్రత్యేకం. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉన్న క్యూట్ పిక్‌ను షేర్ చేసింది ఆయన సోదరి మంజుల. మనల్ని చిన్నప్పటి నుంచి ప్రతీ ఫేజ్‌లో చూసిన ఏకైక వ్యక్తులు తోడబుట్టినవారే. ప్రతీ ఒక్కరి జీవితంలో సోదర బంధం అత్యంత విలువైనది అంటూ లవ్లీ కామెంట్ జోడించారు.
డింపుల్ బ్యూటీ ప్రీతి జింటా తన సోదరులకు సాంప్రదాయబద్ధంగా తిలకం దిద్ది రాఖీ కట్టింది. 'నా ప్రతీ తుంటరి పనికి, ఆనందానికి క్రైమ్ పార్టనర్స్ అయిన నా సోదరులకు రాఖీ శుభాకాంక్షలు' అంటూ మురిసిపోయింది. వారి సోదరులకు సంప్రదాయబద్ధంగా తిలకం దిద్ది రాఖీ కట్టిన క్యూట్ పిక్స్‌ను షేర్ చేసింది.
జెనీలియా తన సోదరుడు నైజెల్ (నిగూ పిగూ) తో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. రాఖీ కట్టిన తర్వాత గిఫ్ట్ ఎన్వలప్ కోసం ఇద్దరూ కొట్టుకున్న ఫన్నీ వీడియో వైరల్ అయ్యింది. అక్కగా నేనే గిఫ్ట్ ఇవ్వాలి కానీ, ఈసారి తమ్ముడే నెగ్గాడని చమత్కరించింది. పండగంటేనే ఈ స్వీట్ కొట్లాట కదా మరి అంటే ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తన తండ్రి సురేష్ ఒబెరాయ్ కాలం నాటి రాఖీ మధురానుభూతులను గుర్తుచేసుకున్నారు బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్. ఇప్పుడు ఆయన పిల్లలు వివేన్, అమీయాలు కూడా దూరంగా ఉన్న బంధువులకు రాఖీలు పంపుతూ ఈ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని ఎమోషనల్ అయ్యారు. తమ కుటుంబంలో మూడు తరాలుగా రాఖీ వేడుకలు ఎలా సాగుతున్నాయో చెప్తూ, విదేశాల్లో ఉన్నా ప్రేమతో వచ్చే రాఖీ ఎన్వెలప్స్ ఇచ్చే ఆనందాన్ని పంచుకున్నాడు
నటి, ఎంపీ కంగనా రనౌత్ తన తమ్ముడు, వదినలతో వేడుకలు జరుపుకుని భావోద్వేగ నోట్ రాశారు. నేను నీ చేతికి కట్టిన ఈ దారమే నిన్ను ఎల్లప్పుడూ కాపాడుగాక. మన తల్లిదండ్రుల సేవ చేస్తూ, కుల గౌరవాన్ని నిలబెట్టాలి అంటూ ఆశీస్సులు అందించారు. సోదరుడికి రాఖీ కట్టిన ఫోటలోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
రణబీర్ కపూర్ & రణ్‌వీర్ సింగ్: రణబీర్ సోదరి రిద్ధిమా కపూర్ తమ చిన్ననాటి అరుదైన క్యూట్ పిక్‌ను షేర్ చేయగా, రణ్‌వీర్ సింగ్, అల్లు అర్జున్ వంటి స్టార్లు కూడా తమ సోదరీమణులతో దిగిన అపూర్వ క్షణాలను అభిమానులతో పంచుకున్నారు.
కాలం మారినా, మన చిన్ననాటి జ్ఞాపకాలు, గొడవలు, మాటల్లేని ప్రేమాభిమానాలు ఎప్పటికీ మారవు అంటూ సంజయ్ దత్ సోదరి ప్రియా దత్ పోస్ట్ చేసిన మెసేజ్ ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది.
వీటికి తోడు మెగా ఫ్యామిలీ, దగ్గుబాటి, అక్కినేని కాంపౌండ్లతో పాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా తమ సోదర సోదరీమణులతో దిగిన అపురూప చిత్రాలను పంచుకోవడంతో నెటిజన్లు శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు
మొత్తానికి ఈసారి రాఖీ వేడుకలు రంగురంగుల జ్ఞాపకాలను, తోబుట్టువుల మధ్య ఉన్న తియ్యని బంధాలను ప్రపంచానికి మరోసారి చాటిచెప్పాయి. సెలబ్రిటీల సందడితో సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్‌గా నిలిచింది...
