గ్రూప్‌-1 నియామకాలపై హైకోర్టులో విచారణ వాయిదా

గ్రూప్‌-1 నియామకాలపై  హైకోర్టులో విచారణ వాయిదా

హైదరాబాద్, వెలుగు: గ్రూప్‌-1 నియామకాలకు సంబంధించి టీజీపీఎస్సీ, ఎంపికైన అభ్యర్థులు దాఖలు చేసిన అప్పీళ్లపై హైకోర్టు విచారణను నవంబర్​ 18కి వాయిదా వేసింది. ప్రతివాదులైన పిటిషనర్లు రాతపూర్వక వాదనలు సమర్పించలేకపోవడంతో విచారణ వాయిదా పడింది.

 గ్రూప్‌ 1  మెయిన్స్‌ జవాబు పత్రాలను పునర్​ మూల్యాంకనం చేసి వచ్చిన ఫలితాల ఆధారంగా నియామకాలు చేపట్టాలని లేదంటే తాజాగా పరీక్షలు నిర్వహించాలంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ టీజీపీఎస్సీ తోపాటు మెయిన్స్‌లో ఎంపికైన అభ్యర్థులు వేర్వేరుగా దాఖలు చేసిన అప్పీళ్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్, జస్టిస్‌ జి.ఎం.మొహియుద్దీన్​ల ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది.