తెలంగాణలో రోడ్ల అధ్వాన్నంపై హైకోర్టులో పిల్

తెలంగాణలో రోడ్ల అధ్వాన్నంపై హైకోర్టులో పిల్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యానికి నెంబర్‌‌ కేటాయించాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిల్‌‌కు నెంబర్‌‌ కేటాయించేందుకు రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను చీఫ్‌‌ జస్టిస్‌‌ ఏకే సింగ్‌‌ నేతృత్వంలోని బెంచ్‌‌ సోమవారం తోసిపుచ్చింది. 

రోడ్లు అధ్వాన్నంగా ఉండటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయంటూ దాఖలైన పిల్‌‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, జీహెచ్‌‌ఎంసీని ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిల్‌‌పై చీఫ్‌‌ జస్టిస్‌‌ ఆధ్వర్యంలోని బెంచ్‌‌ విచారణ చేపట్టనున్నది.