హైదరాబాద్, వెలుగు : అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సోమవారం హైకోర్టు బార్ అసోసియేషన్ రాముడికి ఘనంగా ప్రత్యేక పూజలు చేసింది. అసోసియేషన్ హాల్లో రాముడి చిత్ర పటానికి అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కల్యాణ్‌రావు చెంగల్వ సారధ్యంలో పలు పూజలు జరిగాయి. ఈ సందర్భంగా భారీ స్థాయిలో రెండున్నర వేల మందికి అన్నదానం చేశారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గాడి ప్రవీణ్ కుమార్, సీనియర్ అడ్వొకేట్లు టి. సూర్య కరణ్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, అసోసియేషన్ నాయకులు దేవేందర్, బైరెడ్డి శ్రీనివాస్, కృష్ణకుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
