కేసు నడుస్తుంటే హామీలా?..హైడ్రా కమిషనర్‌‌పై హైకోర్టు ఆగ్రహం

కేసు నడుస్తుంటే హామీలా?..హైడ్రా కమిషనర్‌‌పై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు: హైడ్రా కమిషనర్ రంగ నాథ్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బతుకమ్మకుంట పునరుద్ధరణకు సంబంధించి కేసు విచారణ జరుగుతుండగా, హామీలు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. 

కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా బతుకమ్మకుంట పున రుద్ధరణ పనులు చేపడుతున్నారని సుధాకర్‌ రెడ్డి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య, జస్టిస్‌ మధుసూదన రావుతో కూడిన బెంచ్ శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫు లాయర్..  సంక్రాంతి సందర్భంగా బతుకమ్మకుంట వద్ద జరిగిన కార్యక్రమాల వీడియోను సమర్పించారు.