గ్రేటర్‌ వార్డుల పునర్విభజనపై కౌంటర్ల దాఖలుకు చివరి అవకాశం

గ్రేటర్‌ వార్డుల పునర్విభజనపై కౌంటర్ల దాఖలుకు చివరి అవకాశం
  •   మూడు వారాల్లో వేయకపోతే రూ.5 వేలు జరిమానా: హైకోర్టు 

హైదరాబాద్, వెలుగు: జీహెచ్‌ఎంసీ పరిధిలో వార్డుల పునర్విభజన ప్రక్రియకు సంబంధించిన వ్యవహారంలో కౌంటర్లు దాఖలు చేయడానికి చివరి అవకాశంగా ప్రభుత్వానికి హైకోర్టు 3 వారాల గడువు మంజూరు చేసింది.

 నిర్దేశించిన గడువులోగా కౌంటర్లు దాఖలు చేయని పక్షంలో రూ.5 వేలు జరిమానాగా రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీకి చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. తరువాత వారంలోగా రిప్లై కౌంటరు దాఖలు చేయాలని పిటిషనర్‌ను ఆదేశించింది. గ్రేటర్‌ పరిధిలో 1996లో జారీ అయిన జీవో 570 ప్రకారం వార్డుల పునర్విభజన చేపట్టకపోవడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన సయ్యద్‌ సలీం మరొకరు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.