హైదరాబాద్, వెలుగు: ఐబొమ్మ రవి అలియాస్ ఇమ్మంది రవికి మంగళవారం హైకోర్టు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. ఆయనను అరెస్ట్ చేసి 90 రోజులు దాటినా చార్జిషీటు దాఖలు చేయకపోవడంతో బెయిలు మంజూరు చేసింది. రవి దాఖలు చేసిన బెయిలు పిటిషన్‌లపై జస్టిస్ కె.సుజన విచారణ చేపట్టారు. చార్జిషీటు అభియోగ పత్రం దాఖలు చేసేదాకా రోజూ ఉదయం 11 నుంచి సాయంత్రం 5 లోగా దర్యాప్తు నిమిత్తం ఎస్‌హెచ్‌ఓ ముందు హాజరుకావాలన్నారు.
పాస్‌పోర్టును వారంలోగా సంబంధిత కోర్టులో స్వాధీనం చేయాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచివెళ్లరాదని ఆదేశించారు. నివాసం చిరునామా, ఫోన్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలు, డిజిటల్ పరికరాలను దర్యాప్తు అధికారికి అప్పగించాలని, ఏవైనా మార్పులుంటే వాటిపై కూడా సమాచారం ఇవ్వాలన్నారు. ఇంటర్నెట్ తదితరాలను వినియోగించరాదన్నారు.
