పెన్షన్ల కోతపై హైకోర్టులో విచారణ

పెన్షన్ల కోతపై హైకోర్టులో విచారణ

లాక్డౌన్ వల్ల పెన్షన్లపై ప్రభుత్వం 25 శాతం కోత విధించింది. దాంతో పెన్షన్ల కోతపై జేఏసీ నేత లక్ష్మయ్య హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3 లక్షల మంది పెన్షదారుల పెన్షన్ కట్ చేయొద్దని పిటీషనర్ తన పిటీషన్‌లో కోరారు. మే నెల పెన్షన్ కట్ చెయ్యకుండా ఫుల్ పెన్షన్ వేసేలా చూడాలని పిటీషనర్ హైకోర్టును కోరారు. ఈ పిటీషన్‌ను హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. పెన్షన్ల కోతపై ప్రభుత్వం పునరాలోచిస్తుందని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. జూన్ 1 వరకు ఫుల్ పెన్షన్ వెయ్యకపోతే అదే రోజు ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను హైకోర్టు జూన్ 1కి వాయిదా వేసింది.

For More News..

క్రైమ్ పెట్రోల్ నటి ప్రేక్ష మెహతా సూసైడ్

టెన్త్ ఫలితాల్లో టాపర్‌గా కూరగాయల రైతు కొడుకు

తల్లిపై కిరోసిన్ పోసి నిప్పటించిన కొడుకు