మాజీ సీఎస్ సోమేశ్ కుమార్కు బెయిలబుల్ వారెంట్

మాజీ సీఎస్ సోమేశ్ కుమార్కు బెయిలబుల్ వారెంట్

రాష్ట్ర మాజీ సీఎస్ సోమేశ్ కుమార్కు హైకోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో ఒక ప్లాట్కు సంబంధించిన వ్యవహారంలో కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. కోర్టుకు హాజరుకావాలని పలుమార్లు ఆదేశించిన సోమేష్ కుమార్  గైర్హాజరయ్యారు. దీంతో సోమేశ్ కుమార్కు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. రాష్ట్ర సీఎస్ గా ఉన్న సోమేష్ను హైకోర్టు ఏపీకి వెళ్లాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయన ఏపీలో రిపోర్ట్ చేసి పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు.