
- ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైద్రాబాద్, వెలుగు: మున్సిపాలిటీల్లో గ్రామ పంచాయతీలను విలీనం చేయడంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ శివారులో ఉన్న 51 గ్రామ పంచాయతీలను 14 మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ 3ను సవాలు చేస్తూ మాజీ సర్పంచి పద్మావతి మరో నలుగురు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస రావుల బెంచ్ విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు లాయర్ వాదిస్తూ..పట్టణీకరణతో గ్రామీణ వాతావరణం దెబ్బ తింటుంద ని, అభివృద్ధి పేరుతో కంటితుడుపు చర్యలు చేపట్టి పన్నులు పెంచుతున్నా రని వివరించారు. వాదనలను విన్న బెంచ్.. సంబంధిత అధికారులకు నోటీసులిస్తూ, విచారణను వాయిదా వేసింది.